Tulip Garden Kashmir: ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్ ఓపెన్ అయింది.. టికెట్ ధర, టైమింగ్స్ వివరాలు..
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:40 PM
Asia Largest Tulip Garden Kashmir: తులిప్ పూల అందాలకు దాసోహం అనని వారుండరు. ఇవన్నీ విరబూసే చోటును ప్రత్యక్షంగా చూసే అవకాశం కంటే మరో అదృష్టం ఉండదనుకుంటారు నేచర్ లవర్స్. ఆ సమయం వచ్చేసింది. ఆసియాలోనే అతిపెద్దదైన కశ్మీర్ తులిప్ పూల ఉద్యానవనం తెరుచుకుంది. వివిధ వర్ణాల్లో మెరిసిపోయే తులిప్ పూలు సందర్శకులను రారమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నాయి..

Asia Largest Tulip Garden Kashmir: ప్రకృతి సోయగాలకు నెలవైన కశ్మీర్ లెక్కలెన్నన్ని అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. వాటి అందాలను ఎంత చూసినా తనివితీరదు. కొన్ని అందాలను ప్రత్యేక సీజన్లో మాత్రమే సందర్శించగలం. అలాంటిదే ఆసియాలోనే అతి పెద్దదైన ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్ (Indira Gandhi Memorial Tulip Garden). వసంతకాలంలో మాత్రమే చూపరులకు కనువిందు చేసే తులిప్ పూల తోట ఎప్పట్లాగే ఈ ఏడాది సందర్శకులకు బుధవారం, మార్చి 26 నుంచి అందుబాటులోకి వచ్చింది. సంవత్సరంలో కేవలం 20 నుంచి 30 రోజుల వరకే తెరిచి ఉండే గార్డెన్ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
ఏడాదిలో 20 నుంచి 30 రోజులే తెరుస్తారు..
(Srinagar) లోని తులిప్ గార్డెన్Tulip Garden ఆసియాలోనే అతిపెద్దది. జబర్వాన్ పర్వతం, దాల్ సరస్సు పాదాల మధ్య ఉన్న ఈ ఉద్యానవనాన్ని గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచేవారు. ఈ తోటలో ఏడాదిలో 20 నుండి 30 రోజుల పాటు తులిప్ పుష్పాలు వికసిస్తాయి.శ్రీనగర్‌లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా నిలిచే ఈ గార్డెన్‌ను తిలకించేందుకు ప్రతి సంవత్సరం దేశవిదేశాల లక్షలాది మంది సందర్శకుల తరలివస్తారు. గత సంవత్సరం మొత్తం 4.65 లక్షలకు పైగా సందర్శకులు ఈ ఉద్యానవనాన్ని సందర్శించారు. 2023లో ఈ సంఖ్య 3.65 లక్షలుగా ఉంది. ఈ సంవత్సరం బుధవారం మార్చి 26న ప్రజల కోసం పుష్పవిభాగం అధికారులు తులిప్ గార్డెన్ తెరిచారు. ప్రారంభించిన నాటి నుంచే పర్యాటకులు, స్థానికుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.
55 హెక్టార్లో.. 17 లక్షల పుష్పాలు..
గతంలో జమ్మూ కశ్మీర్‌కు వేసవి, శీతాకాలాల్లో పర్యాటకుల సంఖ్య అధికంగా ఉండేది. అందుకని 2007లో అప్పటి ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఈ తోటను ఏర్పాటు చేశారు. నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న 50,000 తులిప్ మొక్కలతో ఈ గార్డెన్ ప్రారంభమైంది. 55 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ తోటలో ప్రస్తుతం 17 లక్షల తులిప్ పువ్వులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం రెండు కొత్త రకాల తులిప్ పుష్పాలను జోడించారు. ఇక్కడ మొత్తం 74 రకాల పువ్వులున్నాయి. వివిధ రంగుల్లో వికసించే తులిప్ పుష్పాలు అందాలు ప్రకృతి ప్రేమికుల మనసులు దోచేస్తున్నాయి.
తులిప్ గార్డెన్ టికెట్ ధరలు, సమయం
గార్డెన ఎంట్రీకి పెద్దలకు టికెట్ ధర రూ.75. 5-12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు రూ. 30 చెల్లించాలి. GSTతో కలిపి ఈ ధరలు ఉంటాయి. తులిప్ తోట ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తులిప్ గార్డెన్‌ను ప్రారంభించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆ వివరాలను X వేదికగా పంచుకున్నారు. " ఒక దశాబ్దం గడిచిన తర్వాత నేను శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్‌ను అధికారికంగా సందర్శకుల కోసం ప్రారంభించేందుకు ఇక్కడకు వచ్చాను. రాబోయే కొన్ని వారాలు వేలాది మంది ఆసియాలోనే అతిపెద్దదైన తులిప్ గార్డెన్‌ను సందర్శించి రంగుల అల్లరిని ఆస్వాదించవచ్చు" అని ఆయన రాశారు.
Read Also: Spiritual: కాశీ విశ్వనాథ దర్శనానికి ముందు సందర్శించాల్సిన ఆలయాలు
Pilot forgets Passport: గగనతలంలో ఉండగా జరిగిన పొరపాటు గుర్తొచ్చి పైలట్‌కు షాక్.. విమానం యూటర్న్!
Liquor Mixing : మందులోకి కూల్‌డ్రింక్ బెటరా.. వాటర్ బెటరా..