Share News

Crow Viral Video: వరుసగా మాయమవుతున్న దుస్తుల హ్యాంగర్లు.. చివరకు మేడపై కాకి నిర్వాకం చూసి అంతా షాక్..

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:33 PM

ఓ కాకి మేడపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. దుస్తులు ఆరేసే హ్యాంగర్లు రోజుకు ఒకటిగా కనిపించకపోవడంతో ఎవరైనా ఎత్తుకెళ్తున్నారేమో అని ఆ ఇంటి వారికి అనుమానం కలిగింది. ఓ రోజు సైలెంట్‌గా వెళ్లి మేడపై గమనించగా.. షాకింగ్ సీన్ కనిపించింది..

Crow Viral Video: వరుసగా మాయమవుతున్న దుస్తుల హ్యాంగర్లు.. చివరకు మేడపై కాకి నిర్వాకం చూసి అంతా షాక్..

పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. జంతువలపై దాడి చేసే రాబందులను చూశాం. పాటలు పాడే పక్షులను చూశాం. మనుషులతో మాట్లాడే అందమైన రామచిలుకలను కూడా చూశాం. ఇలాంటి వింత పక్షులకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా , ఓ కాకి వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాకి తెలివిగా చోరీ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈ కాకి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగానే కాకులు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఒక కాకి చనిపోతే వందల కాకులు చుట్టుముట్టి, కారణమైన వారిని వదలకుండా వెంటపడడం చూస్తుంటాం. అలాగే మరికొన్నిసార్లు కావ్.. కావ్.. అని అరుస్తూ విసిగిస్తుంటాయి. అయితే తాజాగా ఓ కాకి మేడపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Funny Viral Video: ఆచీ తూచీ అడుగు వేయమనేది ఇందుకే.. ఇతడికి ఏమైందో చూస్తే పగలబడి నవ్వుతారు..


దుస్తులు ఆరేసే హ్యాంగర్లు రోజుకు ఒకటిగా కనిపించకపోవడంతో ఎవరైనా ఎత్తుకెళ్తున్నారేమో అని ఆ ఇంటి వారికి అనుమానం కలిగింది. ఓ రోజు సైలెంట్‌గా వెళ్లి మేడపై గమనించగా.. ఓ కాకి చేసిన నిర్వాకం వారిని ఖంగుతినిపించింది. ఎవరూ లేని సమయంలో చూసి మేడపై వాలిన కాకి..(Crow steals clothes hangers) హ్యాంగర్‌ను నోట కరుచుకుని నేరుగా ఓ స్తంభంపైకి వెళ్తోంది. ఏం చేస్తుందబ్బా అని స్తంభంపై పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది. రోజూ హ్యాంగర్లను ఎత్తుకెళ్తున్న కాకి.. స్తంభంపై ఏకంగా పెద్ద గూడే కట్టేసింది.

Accident Viral Video: ప్రమాదం ఎక్కడి నుంచైనా రావొచ్చు.. దంపతులు నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా..


ఇలా హ్యాంగర్లను చోరీ చేసి తన పిల్లలకు అందమైన గూడును నిర్మించేసిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నగరాల్లో చెట్లు లేకపోవడంతో హ్యాంగర్లనే కొమ్మలుగా ఉపయోగించుకున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘హ్యాంగర్లతో పెద్ద దుకాణమే పెట్టేశాయిగా’’.. అంటూ మరికొందరు, వివి రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 95 వేలకు పైగా లైక్‌లు, 2.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2025 | 06:48 PM