Share News

Viral: ఇంట్లో అంట్లు తోమనంటూ భారత సంతతి సీఈఓ పోస్టు.. నెట్టింట విమర్శల వెల్లువ

ABN , Publish Date - Jan 06 , 2025 | 05:05 PM

రోజూవారి ఇంటి పనులపై సమయం వెచ్చించడం కంటే వాటిని సహాయకులకు అప్పగించి, ఆర్థికలాభం చేకూర్చే పనులపై దృష్టిసారించాలంటూ ఓ భారత సంతతి సీఈఓ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ఇంట్లో అంట్లు తోమనంటూ  భారత సంతతి సీఈఓ పోస్టు.. నెట్టింట విమర్శల వెల్లువ

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది పురుషులు ఇళ్లల్లో తమ భార్యలకు వీసమెత్తు కూడా సాయం చేయరు. ఇది చాలా సంసారాల్లో గొడవలకు దారి తీస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఓ భారత సంతతి సీఈఓ చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకే దారి తీశాయి. తాను ఇంట్లో అంట్లు తోమనని చెప్పడమే కాకుండా తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ఓ సరికొత్త లాజిక్ కూడా పేర్కొన్నారు. అతడి తీరును కొందరు విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం తప్పు బడుతున్నారు. ఇంటిపనుల్లో జీవిత భాగస్వామికి సహకరిస్తే అనురాగం, అనుబంధం పెరుగుతాయని చెబుతున్నారు (Viral).

రవి అబ్బుల అనే భారత సంతతి సీఈఓ చేసిన ఈ వ్యాఖ్య ప్రస్తుతం సంచలనంగా మారింది. తానెందుకు ఇంటి పనుల్లో కల్పించుకోనిదీ అతడు లింక్డ్‌ఇన్‌లో చెప్పుకొచ్చాడు. ‘‘ఇంటి పనులను ఇతరులకు అప్పగిస్తే గంటకు 15 డాలర్లు ఖర్చవుతుంది. నా సమయం విలువ గంటకు 5 వేల డాలర్లు. కాబట్టి, ఈ పని 15 డాలర్లకు ఎవరికైనా అప్పగించడమే బెటర్. ఇది సుస్పష్టం’’ అని చెప్పుకొచ్చారు.


Viral: జీతంలో 70 శాతం పొదుపు చేసి 34 ఏళ్లకే రిటైర్మెంట్! తరువాత ఏం జరిగిందంటే..

గంటకు 15 డాలర్లు పొదుపు చేసేందుకు వెచ్చించే బదులు 5 వేల డాలర్ల ఆదాయం ఇచ్చే పనులు చేయాలని అన్నారు. ఈ పోస్టుతో పాటు తను జెట్ స్కీపై కూర్చుని సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. తద్వారా జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది పరోక్షంగా ప్రస్తావించారు.

ఈ పోస్టు చూస్తుండగానే వైరల్ అయిపోయింది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు అతడితో ఏకీభవించారు. ‘ఇది సబబైన ఆలోచనే. ఈ రోజుల్లో ఎన్నో పనులను ఏఐకి లేదా గంటకు ఇంత అని డబ్బులు తీసుకునే సహాయకులకు బదిలీ చేయొచ్చు. నా సమయం కూడా నాకు అత్ంత విలువైనది. ఈ సమయాన్ని రోజువారీ పనులపై వెచ్చించే బదులు విలువ జోడించే పనులకు కేటాయించొచ్చు. సహాయకులు ఎవరూ లేనప్పుడు ఇలాంటి మనమే చేస్తాం కదా’’ అని ఓ వ్యక్తి అన్నారు.


Viral: చిరుత వేటకు జింక బలి.. షాక్‌లో మరో 7 జింకల మృత్యువాత

కొందరు మాత్రం అతడి తీరును విమర్శించారు. ‘‘ఇలాగైతే నిద్ర పోవడం కూడా మానేయండి. నిద్ర వల్ల పైసా ఉపయోగం ఉండదు’’ అరి మండిపడ్డారు. ప్రతి అంశాన్నీ లాభనష్టాల కోణంలో చూడకూడదని ఓ వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటిపనుల్లో జీవిత భాగస్వామికి సహకరించి ఆప్యాయతానురాగాలను పెంపొందించుకోవచ్చని అన్నారు. ‘‘జెఫ్ బెజోస్ లాంటి అపర కుబేరులు కూడా ఇంటి పనులు చేస్తారన్న విషయం మర్చిపోకూడదు’’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న

Read Latest and Viral News

Updated Date - Jan 06 , 2025 | 05:05 PM