Life On Boat: ఉన్నదంతా అమ్మేసి.. 42 అడుగుల పడవపైన.. ఇదో వింత కథ..
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:19 PM
Indian family sailboat adventure: మంచి ఉద్యోగాలు వదులుకుని.. ఆస్తులు మొత్తం అమ్మేసి.. ఓ భారతీయ కుటుంబం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎవరూ చేయని విధంగా సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ కథ వింటే ఆశ్చర్యం కలగక మానదు.

Indian family sailboat adventure: ఒక భారతీయ కుటుంబం ఎవరూ చేయని విధంగా డేరింగ్ డెసిషన్ తీసుకుంది. సామాన్యులు ఏదైతే ఉండాలని కోరుకుంటారో అవన్నీ ఉన్నా మాకొద్దని వింతైన నిర్ణయం తీసుకున్నారు. లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు, విలాసవంతమైన సదుపాయాలు కాదనుకుని ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు గౌరవ్ గౌతమ్, వైదేహి దంపతులు. కూతురు కేయాతో కలిసి ఈ దంపతులు 2022లో 42 అడుగుల సెయిల్‌బోట్ "రీవా"పై కొత్త జీవితం ప్రారంభించారు. అప్పట్లో ఎవరికీ అంతగా తెలియకపోయినా.. మూడేళ్ల తర్వాత వీరి లైఫ్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
పడవపై జీవన ప్రయాణం..
ప్రపంచం మొత్తం చుట్టేసి వివిధ దేశాల సంస్కృతులను తెలుసుకోవాలని, కొత్త ప్రాంతాల్లో జీవితాన్ని ఆస్వాదించాలని గౌరవ్, వైదేహి దంపతుల చిరకాల స్వప్నం. ఉద్యోగాలతో బిజీగా ఉంటూ తమ ఆశయాన్ని నెరవేర్చుకోవడం వారికి అసాధ్యమే అయింది. అందుకే కల నిజం చేసుకునేందుకు మూడేళ్ల క్రితం ఎవరూ ఊహించని సాహసం చేశారు. ఇల్లు, కార్లు, సొమ్ములు ఇలా అన్నీ అమ్మేసి బోటులో జీవించేందుకు కావలసిన వ్యవస్థను సిద్ధం చేసుకున్నారు. సముద్రంపై పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. అయినా కుటుంబంతో కలిసి సముద్రంపై పడవ ప్రయాణం చేస్తూ జీవించాలని నిశ్చయించుకున్నారు. ఇది చెప్పినంత మామూలు విషయమేం కాదు. పడవలో తక్కువ సౌకర్యాలతోనే జీవనం కొనసాగిస్తున్నారు. 42 అడుగుల పడవలో కేవలం 120 కిలోల బరువున్న వస్తువులతో సముద్రంపై జీవన ప్రయాణం చేస్తున్నారు. కుమార్తె కేయా కోసం హోంస్కూలింగ్ ఏర్పాటుచేశారు.
20 నెలల నుంచి అనిశ్చితిలోనే నిశ్చింతగా..
ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఎదురైనా మేం పొందిన అనుభవం అపూర్వమైనది అంటున్నారు ఈ కపుల్స్. సముద్రం మీద జీవతం అంటే ప్రతిరోజూ కొత్త రకాల సవాళ్లు ఎదుర్కొవాల్సిందే. అయితే, విభిన్న దేశాల ప్రజలతో పరిచయాలు వారి జీవన విధానాన్ని, ఆలోచనా తీరును పూర్తిగా మార్చేశాయి. అనిశ్చితితో నిండిన సముద్ర మార్గంలో వారు సుమారు 20 నెలల నుంచి తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో ఎన్నో మధుర జ్ఞాపకాలను పోగు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
‘ది రీవా ప్రాజెక్ట్’ పేరుతో గౌరవ్, వైదేహి దంపతులు వారి ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. ఇప్పటి వరకూ వీరికి 8,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సాధారణ జీవితం వదిలి తమ జీవితానికి అర్థం ఉండాలని సరికొత్త మార్గంలో పయనిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. భద్రత అనే పేరుతో నాలుగ్గోడల మధ్యే జీవితం మొత్తం గడిపేయకుండా వినూత్న బాట వెతుక్కుని రోజుకో కొత్త అనుభవంతో జీవితాన్ని జీవిస్తున్నారని నెటిజన్లు కితాబిస్తున్నారు.
Read Also: Viral Video: బ్రష్‌తో బైక్‌నే నడిపించాడుగా.. ఇతడి టెక్నిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..
Kitchen Hacks Viral Video: కొత్తిమీర త్వరగా వాడిపోతోందా.. అయితే ఈ వీడియో మీకోసమే..
Dog vs Wolves: కుక్కను చుట్టుముట్టిన తోడేళ్లు.. చివరకు మీ ఊహకందని షాకింగ్ సీన్..