Love Marriage: ప్రాణాలు తీస్తున్న ప్రేమికులు.. కాళ్లపారాని ఆరకముందే హత్యకు కుట్ర.. మీరట్ ఘటన మరువక ముందే..
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:15 PM
ప్రేమికులు జీవితాంతం కలిసి ఉండాలనుకోవడం సర్వసాధారణం. అయితే చాలా ప్రేమ కథల్లో పెద్దలే విలన్లుగా మారుతుంటారు. ఇలాంటి సమయాల్లో పారిపోయి పెళ్లి చేసుకోవడమో లేదా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమో జరుగుతుంటుంది. మరికొందరు..

ప్రేమికులు జీవితాంతం కలిసి ఉండాలనుకోవడం సర్వసాధారణం. అయితే చాలా ప్రేమ కథల్లో పెద్దలే విలన్లుగా మారుతుంటారు. ఇలాంటి సమయాల్లో పారిపోయి పెళ్లి చేసుకోవడమో లేదా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమో జరుగుతుంటుంది. మరికొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని రాజీ పడి జీవితాన్ని సాగిస్తుంటారు. అయితే ఇటీవల ప్రేమికులు హంతకులుగా మారుతున్నారు. ఓ వైపు ప్రేమించిన వారిని మర్చిపోలేక.. మరోవైపు పెళ్లి చేసుకున్న వారితో కలిసి ఉండలే.. చివరకు హత్యలకు తెగబడుతున్నారు. యువతి తన ప్రియుడితో కలిసి భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి చంపిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లో ముస్కాన్ అనే యువతి తన ప్రేమికుడు సాహిల్‌తో కలిసి భర్త సౌరభ్‌ను హత్య చేసిన విషయం సంచలంన సృష్టించిన విషయం తెలిసిందే. సౌరభ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికిన వారు, ఆ ముక్కలను డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో మూసివేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా హిమాచల్ ప్రదేశ్‌కు పర్యటనకు వెళ్లారు. 11 రోజుల పాటు అక్కడ సరదాగా గడిపారు. అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఈ భయంకరమైన రహస్యం బయటపడింది. చివరకు పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు.ఈ ఘటన మరువక ముందే ఔరయ్యా జిల్లాలో ఇలాంటి షాకింగ్ ఘటనే చోటు చేసుకుంది.
ఔరయ్య జిల్లాకు చెందిన ప్రగతి యాదవ్ అనే యువతికి.. ఇదే ప్రాంతానికి చెందిన అనురాగ్ యాదవ్ అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దలకు తెలీకుండా ప్రేమికులనేవారు. ఇలా నాలుగేళ్ల తర్వాత వారి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. అయితే వారి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు.. ఆమెకు ఈ మార్చి 5న దిలీప్ (25) అనే వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. వివాహమైనా ప్రగతి తన ప్రేమికుడిని మర్చిపోలేకపోయింది. అనురాగ్ కూడా తన ప్రియురాలిని ఎలాగైనా కలుసుకోవాలని ప్రయత్నించేవాడు.
అయితే కలుసుకోవడం కుదరకపోవడంతో చివరకు ఏకంగా భర్తనే చంపేయాలని ప్రగతి ఫిక్స్ అయింది. చివరకు ప్రేమికులిద్దరూ పక్కా పథకం ప్రకారం స్కెచ్ గీశారు. దిలీప్‌ను హత్య చేసేందుకు రామాజీ చౌదరీ అనే వ్యక్తికి రూ.2లక్షల సుఫారీ కూడా ఇచ్చారు. రామాజీ కొంత మందిని తీసుకుని దిలీప్‌ను బైకుపై పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి, తుపాకీతో కాల్చి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారింగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.