Share News

Theft Funny Video: రాత్రి వేళ కారు వద్దకు వెళ్లిన దొంగలు.. చివరకు దేన్ని ఎత్తుకెళ్లారో చూస్తే.. ఖంగుతింటారు..

ABN , Publish Date - Mar 14 , 2025 | 06:44 PM

రాత్రి వేళ ఇద్దరు దొంగలు చోరీ చేసేందుకు బైకుపై వస్తారు. వీధి వీధి తిరుగుతూ గమనిస్తుంటారు. ఈ క్రమంలో ఓ వీధిలో కారు కనిపించగానే ఆగుతారు. ఓ దొంగ కిందకు దిగి అక్కడి తలుపు వద్దకు వెళ్లి బయట గడియ వేస్తాడు. ఆ తర్వాత కారు వద్దకు వెళ్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Theft Funny Video: రాత్రి వేళ కారు వద్దకు వెళ్లిన దొంగలు.. చివరకు దేన్ని ఎత్తుకెళ్లారో చూస్తే.. ఖంగుతింటారు..

చోరీలు చేసే సమయంలో కొందరు దొంగలు అత్యంత తెలివిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు దొంగలు లాజిక్‌గా ఆలోచిస్తూ చోరీ చేస్తుంటారు. అలాగే ఇంకొందరు దొంగలు చోరీ చేసే విధానం చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్రమైన దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళ బైకులో వచ్చిన దొంగలు.. కారు వద్దకు వెళ్తారు. అయితే వాహనానికి బదులుగా వారు చేసిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మనసున్న దొంగలంటే వీరే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రాత్రి వేళ ఇద్దరు దొంగలు చోరీ చేసేందుకు బైకుపై వస్తారు. వీధి వీధి తిరుగుతూ గమనిస్తుంటారు. ఈ క్రమంలో ఓ వీధిలో కారు కనిపించగానే ఆగుతారు. ఓ దొంగ కిందకు దిగి అక్కడి తలుపు వద్దకు వెళ్లి బయట గడియ వేస్తాడు. ఆ తర్వాత కారు వద్దకు వెళ్తాడు.

Woman Funny Video: గేదెను కూడా వదల్లేదుగా.. వ్యూస్ కోసం ఈమె చేస్తున్న పని చూడండి..


ఈ ఘటన చూసి అంతా కారును చోరీ చేస్తారేమో అని అనుకుంటారు. అయితే అతను మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తాడు. కారు కాకుండా కారు పైన ఉన్న కవర్‌ను పీకేస్తాడు. ఆ తర్వా దాన్ని చంకలో పెట్టుకుని (Thieves steal car cover) ఇద్దరూ బైకుపై ఉడాయిస్తారు. ఇలా కారుకు బదులుగా కవర్‌ను చోరీ చేసిన దొంగలను చూసి అంతా అవాక్కవుతన్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Metro Viral Video: బస్టాండ్ చేశావ్ కదరా.. మెట్రోలో ఇతడి నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దొంగలు మరీ విచిత్రగా ఉన్నారే’’.. అంటూ కొందరు, ‘‘ఎంత అవసరమో అంతే దోచుకున్నారుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Train Viral Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదే.. రైల్లో ఇతడి నిర్వాకం చూస్తే.. అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Mar 14 , 2025 | 06:44 PM