Woman Funny Video: గేదెను కూడా వదల్లేదుగా.. వ్యూస్ కోసం ఈమె చేస్తున్న పని చూడండి..
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:49 PM
ఓ మహిళ ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలని బలంగా నిర్ణయించుకుంది. ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నా కూడా చివరకు ఆమెకు ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. చివరకు ఆమె గేదె వద్ద చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

‘‘కాదేదీ కవితకు అనర్హం’’.. అన్నది ఒకప్పటి మాట. ప్రస్తుతం.. ‘‘కాదేదీ రీల్స్‌కు అనర్హం’’.. అన్న చందంగా తయారైంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లలు మొదలుకొని పెద్దలు, వృద్ధుల దాకా అంతా రీల్స్ పిచ్చిలో మునిగి తేలుతున్నారు. కొందరైతే ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో కొందరు బురదలో దొర్లుతూ వీడియోలు చేస్తుంటే.. మరికొందరు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో జంతువులతో ఆటలాడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళ వీడియో తెగ వైరల్ అవుతోంది. గేదెతో ఆమె చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘గేదెను కూడా వదల్లేదుగా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (Woman) ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలని బలంగా నిర్ణయించుకుంది. ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నా కూడా చివరకు ఆమెకు ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే ఆచరణలో పెట్టేసింది.
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
పడుకుని ఉన్న ఓ గేదె (Buffalo వద్దకు వెళ్లిన ఆమె.. దారాన్ని ఓ వైపు నోటితో, మరో వైపు చేత్తో పట్టుకుంది. ఎలాగైతే మహిళలకు హైబ్రోస్ చేస్తారో.. (Highbrows) అచ్చం అలాగే ఈమె కూడా గేదె కళ్లపై ఉన్న వెంట్రుకలను దారం సాయంతో ట్రిమ్ చేసింది. ఇలా దారంతో గేదెకు హైబ్రోస్ చేసి అంతా అవాక్కయ్యేలా చేసింది. వ్యూస్ కోసం జంతువులతో వీడియోలను చేయడం కామన్ అయిపోయింది. కొందరైతే ప్రమాదకరమైన మొసళ్లకు ఫుడ్ తినిపించడం కూడా చూశాం.
Metro Viral Video: బస్టాండ్ చేశావ్ కదరా.. మెట్రోలో ఇతడి నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
అలాగే మరికొందరు మహిళలు ఏనుగుతో తమాషా చేస్తూ చివరకు దాని దాడికి గురవడం కూడా చూశాం. తాజగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది గేదెల బ్యూటీఫార్లర్‌లా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Train Viral Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదే.. రైల్లో ఇతడి నిర్వాకం చూస్తే.. అవాక్కవుతారు..
షార్ట్ వీడియోను ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..