Share News

AB De Villiers: ఆ ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 05 , 2025 | 08:46 PM

Virat Kohli: వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకే తరహా బంతులకు వికెట్ అప్పగిస్తూ అందరికీ సాఫ్ట్ టార్గెట్‌గా మారాడు. తాజాగా అతడిపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

AB De Villiers: ఆ ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virat Kohli

IND vs AUS: వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకే తరహా బంతులకు వికెట్ అప్పగిస్తూ అందరికీ సాఫ్ట్ టార్గెట్‌గా మారాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 9 ఇన్నింగ్స్‌ల్లో ఆఫ్ స్టంప్‌కు ఆవల వెళ్తున్న బంతుల్ని వెంటాడి ఔట్ అయ్యాడు. టెక్నిక్, ఫుట్ మూమెంట్‌లో మార్పులు చేసుకోకపోవడం, కాన్ఫిడెన్స్ దెబ్బతినడంతో అతడు భారీ స్కోర్లు బాదలేకపోతున్నాడు. దీంతో జట్టు మీద భారం పడుతోంది. టీమ్ సిరీస్ కోల్పోవడానికి బిగ్ రీజన్స్‌లో కోహ్లీ ఫెయిల్యూర్ కూడా ఒకటి. అందుకే అతడిపై ముప్పేట దాడి జరుగుతోంది. తాజాగా అతడిపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కింగ్ చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంటున్నాడని అన్నాడు. మైండ్ రీసెట్ చేసుకోకపోవడం, ప్రతి బంతిపై ఫోకస్ చేయలేక కష్టాలు కొనితెచ్చుకుంటున్నాడని చెప్పాడు.


అదే బలం, అదే బలహీనత!

‘విరాట్ కోహ్లీ తన మైండ్‌ను రీసెట్ చేసుకోవాలి. ఏయే తప్పులు చేస్తున్నాడో గ్రహించి సరిదిద్దుకోవాలి. ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు అనేది మర్చిపోవాలి. బ్యాటర్లకు ప్రతి బాల్ ముఖ్యమే. సింగిల్ తర్వాత మళ్లీ రీసెట్ చేసుకుంటూనే ఉండాలి. ఒక బాల్ ఆడేసి.. తర్వాతి దానికి సిద్ధమవ్వాలి. కోహ్లీకి యుద్ధం అంటే చాలా ఇష్టం. ఎవ్వరితో పోటీపడమన్నా రెడీ అయిపోతాడు. అయితే అదే అతడి బలం, అదే బలహీనతగానూ మారిపోయింది. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో అతడు పలు గొడవలతో వార్తల్లోకి ఎక్కాడు. ఫామ్‌లో లేని టైమ్‌లో అనవసర ఫైట్స్‌లో తలదూర్చడం సరికాదు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రతి బాల్‌ మీద ఫోకస్ చేయాలి. అదే కోహ్లీ చేయలేకపోతున్నాడు. అతిగా ఇన్వాల్వ్ అవ్వడం కూడా అతడు చేస్తున్న మరో తప్పు’ అని డివిలియర్స్ స్పష్టం చేశాడు.


ఇవీ చదవండి:

ఆర్సీబీ బ్యాటర్ ఊచకోత.. ఈసారి కోహ్లీ టీమ్‌కు కప్ గ్యారెంటీ

పేరెంట్స్ ఆ విషయం మరవొద్దు.. సానియా మీర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కోహ్లీ పరువు తీసిన టీమిండియా క్రికెటర్.. విరాట్ కంటే వాళ్లు నయమంటూ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 05 , 2025 | 08:46 PM