Share News

Abhishek Sharma Records: ఒక్క ఇన్నింగ్స్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ అన్నింటా అసాధ్యుడే

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:59 PM

India vs England: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పాత రికార్డుల బూజు దులిపాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. అన్‌బ్రేకబుల్ రికార్డ్స్‌ను కూడా తనదైన స్టైల్‌లో బద్దలుకొట్టాడు.

Abhishek Sharma Records: ఒక్క ఇన్నింగ్స్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ అన్నింటా అసాధ్యుడే
Abhishek Sharma Records

IND vs ENG: రికార్డులు ఉన్నవి బ్రేక్ చేయడానికేనని కొందరు ఆటగాళ్లు నిరూపిస్తుంటారు. అద్భుతమైన ఆటతో పాత రికార్డులకు పాతర వేసి సరికొత్త చరిత్రకు నాంది పలుకుతారు. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదే పని చేశాడు. ఇంగ్లండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 54 బంతుల్లో 135 పరుగుల విధ్వంసక బ్యాటింగ్‌తో హోరెత్తించాడీ కుర్రాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 7 బౌండరీలు, 13 సిక్సులతో మెరుపులా వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో 8 అన్‌బ్రేకబుల్ రికార్డ్స్‌ను అతడు బద్దలుకొట్టాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


హయ్యెస్ట్ స్కోర్

టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. నిన్నటి మ్యాచ్‌లో 135 పరుగులు చేశాడీ ఓపెనర్. పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున ఓ బ్యాటర్ ఇన్ని పరుగులు ఎప్పుడూ చేయలేదు. ఈ లిస్ట్‌లో మరో యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్) రెండో స్థానంలో ఉన్నాడు. 2023, ఫిబ్రవరి 1వ తేదీన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గిల్ ఈ స్కోరు బాదాడు. ఈ లిస్ట్‌లో రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్), విరాట్ కోహ్లీ (122 నాటౌట్), రోహిత్ శర్మ (121 నాటౌట్) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

రోహిత్ తర్వాత అభిషేకే!

టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ (37 బంతుల్లో) నిలిచాడు. ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ (35 బంతుల్లో) టాప్‌లో ఉన్నాడు.


గురువు తర్వాత శిష్యుడే!

పొట్టి ఫార్మాట్‌లో అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలోనూ అభిషేక్ స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్‌లో అతడి గురువు యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు. శిష్యుడు అభిషేక్ నిన్నటి మ్యాచ్‌లో 17 బంతుల్లో అర్ధ శతకం మార్క్‌ను చేరుకొని ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీస్ లిస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఫాస్టెస్ట్ హండ్రెడ్స్

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగుల మార్క్‌ను చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచాడు అభిషేక్. డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో), రోహిత్ శర్మ (35 బంతుల్లో) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. అభిషేక్ (37 బంతుల్లో) థర్డ్ ప్లేస్‌లో నిలిచాడు.

సిక్సర్ కింగ్

టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్‌గానూ అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో అతడు 13 సిక్సులు కొట్టాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో 10.1 ఓవర్‌లో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు అభిషేక్. దీంతో అతి తక్కువ ఓవర్లలో శతకం మార్క్‌ను అందుకున్న ఆటగాడిగానూ నిలిచాడు.


పార్ట్‌నర్‌షిప్‌లోనూ రికార్డే!

ఇంగ్లండ్‌తో టీ20లో తిలక్ వర్మతో కలసి రెండో వికెట్‌కు ఏకంగా 115 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు అభిషేక్. 16.04 రన్‌రేట్‌తో ఈ జోడీ పరుగులు చేసింది. పొట్టి క్రికెట్‌లో భారత్ తరఫున హయ్యెస్ట్ రన్‌రేట్‌తో పరుగులు చేసిన జోడీగా తిలక్‌తో కలసి అభిషేక్ మరో రికార్డు క్రియేట్ చేశాడు.

కోహ్లీ సరసన అభిషేక్!

నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్ స్కోరు 135. అదే ఇంగ్లండ్ టీమ్ స్కోరు 97. ప్రత్యర్థి జట్టులోని మొత్తం 11 మంది బ్యాటింగ్ చేసినా అభిషేక్ స్కోరుకు దరిదాపుల్లోకి రాలేదు. టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఒక భారత బ్యాటర్ చేసిన స్కోరు కంటే అవతలి జట్టు తక్కువ స్కోరు చేయడం ఇది నాలుగోసారి. గతంలో విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇలాగే జరిగింది.


ఇవీ చదవండి:

అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్

ఇంగ్లండ్ పరువు తీసిన శివమ్ దూబె.. తల ఎత్తుకోకుండా చేశాడు

అభిషేక్‌ ఒక మెంటలోడు.. నితీష్ ఇలా అనేశాడేంటి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 01:08 PM