Share News

IND vs ENG: నా లైఫ్‌లో అన్ని సిక్సులు కొట్టలేదు.. అభిషేక్‌ను ఆకాశానికెత్తిన ఇంగ్లండ్ లెజెండ్

ABN , Publish Date - Feb 03 , 2025 | 02:16 PM

Abhishek Sharma Sixes: టీమిండియా యువ సంచనలం అభిషేక్ శర్మ సంచలన ఇన్నింగ్స్‌తో హోరెత్తించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో స్టన్నింగ్ నాక్‌తో అందరి చూపుల్ని తన వైపునకు తిప్పుకున్నాడు.

IND vs ENG: నా లైఫ్‌లో అన్ని సిక్సులు కొట్టలేదు.. అభిషేక్‌ను ఆకాశానికెత్తిన ఇంగ్లండ్ లెజెండ్
Abhishek Sharma

అభిషేక్ శర్మ.. భారీ షాట్లు కొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. వీర బాదుడుకు అతడు పెట్టింది పేరు. బ్యాట్‌ను మంత్రదండంలా తిప్పుతూ అలవోకగా బౌండరీలు, సిక్సులు కొట్టడం ఈ టీమిండియా ఓపెనర్‌కు అలవాటుగా మారింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి వచ్చి ఎక్కువ కాలం కాలేదు కాబట్టి అభిషేక్ హిట్టింగ్ ఎలా ఉంటుందో చాలా మంది క్రికెట్ లవర్స్‌కు తెలియదు. కానీ అతడి దంచికొట్టుడు ఎలా ఉంటుందో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆల్రెడీ ఇక్కడి ఫ్యాన్స్ చూసేశారు. ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకులకు తన మాస్ బ్యాటింగ్‌ను రుచి చూపించాడు అభిషేక్. ఇంగ్లండ్‌తో నిన్నటి మ్యాచ్‌లో 7 ఫోర్లు, 13 సిక్సులు బాదేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు ఓ ఇంగ్లండ్ లెజెండ్ షాక్ అయ్యాడు.


ఎలా కొట్టావ్ బాస్!

అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 54 బంతుల్లో 135 పరుగులు బాదాడతను. 250 స్ట్రైక్ రేట్‌తో అతడు రన్స్ చేశాడు. ఉతుకుడే లక్ష్యంగా షాట్లు కొడుతూ పోయాడు. అతడి బ్యాటింగ్‌కు ఫ్యాన్ అయిపోయాడు ఇంగ్లండ్ దిగ్గజం అలిస్టర్ కుక్. తాను కెరీర్ మొత్తం మీద కొట్టినన్ని సిక్సులు.. అభిషేక్ ఒక్క మ్యాచ్‌లోనే కొట్టేశాడంటూ ప్రశంసల జల్లులు కురిపించాడు. సుదీర్ఘ కెరీర్‌లో తాను ఇన్ని సిక్సులు బాదలేదన్నాడు. అతడు రెండు గంటల్లోనే అన్ని సిక్సులు కొట్టడం, ఆ విధ్వంసం అంతా షాకింగ్‌గా ఉన్నాయని మెచ్చుకున్నాడు కుక్.


161 మ్యాచుల్లో 10 సిక్సులు!

ఇంగ్లండ్ తరఫున 92 వన్డేలు, 161 టెస్టు మ్యాచులు ఆడాడు కుక్. టెస్ట్ కెరీర్‌లో అన్ని మ్యాచులు ఆడినా అతడు కొట్టింది కేవలం 11 సిక్సులు మాత్రమే. వన్డేల్లో 10 సిక్సులు బాదిన కుక్.. టీ20ల్లో 4 మ్యాచులు ఆడి ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. సాలిడ్ డిఫెన్స్‌కు అతడు పెట్టింది పేరు. గ్యాప్స్‌లో నుంచి బంతుల్ని బౌండరీలకు తరలించడం, స్ట్రైక్ రొటేట్ చేయడం కుక్ బ్యాటింగ్ స్టైల్. ధనాధన్ క్రికెట్‌కు అతడు దూరంగా ఉండేవాడు. అందుకే అభిషేక్ ఇన్నింగ్స్‌ను అతడు మెచ్చుకుంటున్నాడు. ఇదేం బాదుడు సామి.. రెండు గంటల్లో ఇన్ని సిక్సులు ఎలా కొట్టావంటూ షాక్ అయ్యాడు.


ఇవీ చదవండి:

ఒక్క ఇన్నింగ్స్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ అన్నింటా అసాధ్యుడే

అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్

ఇంగ్లండ్ పరువు తీసిన శివమ్ దూబె.. తల ఎత్తుకోకుండా చేశాడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 02:22 PM