Share News

Afghanistan: ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..

ABN , Publish Date - Jan 09 , 2025 | 09:56 AM

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తక్కువ టైమ్‌లోనే ఎదిగిన జట్టుగా ఆఫ్ఘానిస్థాన్‌ను చెప్పొచ్చు. పసికూన స్థాయి నుంచి టాప్ టీమ్స్‌ను చిత్తు చేసే రేంజ్‌కు చేరుకుందా జట్టు. అలాంటి ఆఫ్ఘాన్‌కు ఊహించని షాక్ తగిలింది.

Afghanistan: ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..
Afghanistan

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తక్కువ టైమ్‌లోనే ఎదిగిన జట్టుగా ఆఫ్ఘానిస్థాన్‌ను చెప్పొచ్చు. పసికూన స్థాయి నుంచి టాప్ టీమ్స్‌ను చిత్తు చేసే రేంజ్‌కు చేరుకుందా జట్టు. గత 5 ఏళ్లలో ఆ టీమ్ సాధించిన విజయాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. మేజర్ ఐసీసీ టైటిల్ గెలవనప్పటికీ వన్డే వరల్డ్ కప్-2023 నుంచి టీ20 ప్రపంచ కప్-2024 వరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ లాంటి టీమ్స్‌ను షేక్ చేసింది ఆఫ్ఘాన్. ఆ టీమ్‌తో మ్యాచ్ అంటే అందరూ భయపడే స్థాయికి చేరుకుంది. అలాంటి ఆఫ్ఘాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ టీమ్ ఇప్పుడు నిషేధం అంచున నిలబడింది. అసలు ఆఫ్ఘాన్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..


అల్టిమేటం!

ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌ను బ్యాన్ చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వచ్చే నెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో ఆడేది లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అంటోంది. ఆ జట్టును బ్యాన్ చేయాల్సిందేనని పట్టుబడుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా బోర్డుల మద్దతుతో ఐసీసీ మీద ప్రెజర్ పెడుతోంది. అయితే ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడమని ఈసీబీ చెప్పడానికి ఓ రీజన్ ఉంది. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ సర్కారు ఆగడాల మీద ఇంగ్లండ్‌లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆఫ్ఘాన్ టీమ్‌‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇంగ్లండ్ బోర్డుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. మ్యాచ్ ఆడొద్దంటూ 160 మందికి పైగా అక్కడి నేతలు ఈసీబీకి అల్టిమేటం జారీ చేశారు. ఆడితే ఊరుకోమంటూ హెచ్చరించారు.


ఏం తేలుస్తారో?

తాలిబన్ల ఏలుబడిలో ఆఫ్ఘానిస్థాన్‌లో మహిళలు, బాలికల మీద తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. బాలికలు ఆరో తరగతికి మించి చదవకూడదని రూల్ విధించారు. స్త్రీలు జాబ్స్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిమ్, పార్కులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో లేడీస్ కనిపించకూడదని స్ట్రిక్ట్ రూల్స్ వేశారు. క్రీడల్లోనూ అక్కడి మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారు. దీనిపై ఇంగ్లండ్‌లో తీవ్ర విమర్శలు వస్తుండటంతో అక్కడి రాజకీయ నాయకులు ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని పట్టుబడుతున్నారు. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు ఆడేందుకు భారత్ ఒప్పుకోలేదు. దీంతో దుబాయ్‌కు టీమిండియాకు మ్యాచులు తరలించారు. అలాంటప్పుడు ఆఫ్ఘాన్‌ను బ్యాన్ చేయడం పెద్ద మ్యాటర్ కాదంటూ ఈసీబీ, ఐసీసీపై ఇంగ్లండ్ పొలిటీషియన్స్, ఫ్యాన్స్ ఒత్తిడి పెంచుతున్నారు. ఈ వివాదంపై జైషా అండ్ కో ఏం తేలుస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

చాంపియన్స్‌ బరిలో ఎవరు?

అంతర్జాతీయ క్రికెట్‌కు గప్తిల్‌ గుడ్‌ బై

ప్రీక్వార్టర్స్‌కుప్రణయ్‌,మాళవిక

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2025 | 10:01 AM