Share News

BCCI-ICC: ప్లీజ్.. ఇంకో చాన్స్ ఇవ్వండి.. ఐసీసీకి బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:50 PM

ఏ విషయంలోనైనా ఇతర క్రికెట్ బోర్డుల కంటే బీసీసీఐ ముందంజలో ఉంటుంది. అలాంటిది ఓ విషయంలో మాత్రం వెనుకబడింది. ప్లీజ్.. ఇంకొన్నాళ్లు సమయం ఇవ్వమంటూ ఐసీసీకి రిక్వెస్ట్ చేసింది. దీనికి కారణం ఏంటేది ఇప్పుడు చూద్దాం..

BCCI-ICC: ప్లీజ్.. ఇంకో చాన్స్ ఇవ్వండి.. ఐసీసీకి బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్
Team India

ఏ విషయంలోనైనా ఇతర క్రికెట్ బోర్డుల కంటే బీసీసీఐ ముందంజలో ఉంటుంది. అన్నింటా భారత బోర్డు చక్రం తిప్పుతూ ఉంటుంది. అందరి కంటే టాప్‌లో ఉండాలి, మనల్ని చూసి మిగతావారు స్ఫూర్తి పొందాలనేది బీసీసీఐ ధ్యేయంలా కనిపిస్తుంది. అలాంటిది ఓ విషయంలో మాత్రం వెనుకబడింది భారత బోర్డు. ప్లీజ్.. ఇంకొన్నాళ్లూ సమయం ఇవ్వమంటూ అత్యున్నత క్రికెట్ బోర్డు అయిన ఐసీసీకి రిక్వెస్ట్ చేసింది. దీనికి కారణం ఏంటేది ఇప్పుడు చూద్దాం..


ఎటూ తేల్చలేదు!

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ మీటింగ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. సమావేశం ముగిశాక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడే భారత టీమ్‌ను ప్రకటించింది బీసీసీఐ. అయితే చాంపియన్స్ ట్రోఫీలో తలపడబోయే జట్టును మాత్రం అనౌన్స్ చేయలేదు. ముందు వచ్చిన ఊహాగానాల ప్రకారం మెగా టోర్నీలో ఆడే జట్టును కూడా బోర్డు ప్రకటించాల్సింది. జనవరి 12 లోపే స్క్వాడ్స్‌ను ప్రకటించాలని ఐసీసీ ఆదేశించింది. ఇప్పటికే న్యూజిలాండ్ తమ టీమ్‌ను అనౌన్స్ చేసింది. దీంతో భారత్ కూడా అదే పని చేస్తుందని అంతా భావించారు. కానీ సెలెక్టర్ల సమావేశంలో దీనిపై ఎటూ తేల్చలేదు. దీంతో ఐసీసీకి బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్ చేసిందని తెలుస్తోంది.


బుమ్రా కోసం వెయిటింగ్!

చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌ను అనౌన్స్ చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని ఐసీసీని బీసీసీఐ పెద్దలు కోరారని సమాచారం. జనవరి 19లోపు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 14 మంది ప్లేయర్లతో స్క్వాడ్ లిస్ట్ రెడీ అయిందట. అయితే గాయంతో బాధపడుతున్న పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం, ఎప్పటివరకు కోలుకుంటాడు, ఆడతాడా? లేదా? అనే దానిపై మెడికల్ టీమ్ క్లారిటీ ఇవ్వకపోవడంతో సెలెక్షన్ కమిటీ సందిగ్ధంలో పడిందట. ఇంకో వారం చూసి బుమ్రా అందుబాటుపై స్పష్టత రాగానే టీమ్‌ వివరాలు వెల్లడిస్తామని ఐసీసీని రిక్వెస్ట్ చేసిందని వినిపిస్తోంది.


ఇవీ చదవండి:

హార్దిక్‌ను కాదని అక్షర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ తిక్కకు ఓ లెక్కుంది

చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. ఇక కప్పు కష్టమే..

‘మెల్‌బోర్న్‌’తోనే గుడ్‌ బై చెబుదామనుకున్నాడా!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2025 | 03:58 PM