Jasprit Bumrah: బుమ్రాకు సారీ చెప్పిన స్టార్ సింగర్.. కావాలని చేయలేదంటూ..
ABN , Publish Date - Jan 20 , 2025 | 02:45 PM
Chris Martin: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు ఓ స్టార్ సింగర్ సారీ చెప్పాడు. కావాలని చేయలేదు.. తనను క్షమించాలని కోరాడు. మరి.. ఎవరా సింగర్? బుమ్రాకు ఎందుకు సారీ చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

క్రిస్ మార్టిన్.. ఈ పేరు చెబితే సంగీత ప్రపంచం షేక్ అవుతుంది. కోల్డ్ ప్లే బ్యాండ్‌లో పాటలు పాడుతూ పాప్ వరల్డ్‌ను ఒక ఊపు ఊపుతున్నాడీ మార్టిన్. అతడికి దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. భారత్‌లోనూ ఈ పాప్ సింగర్‌కు భారీ ఫ్యాన్‌బేస్ ఉంది. అందుకే ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కాన్సర్ట్ నిర్వహించాడు. రెండ్రోజుల పాటు అద్భుతమైన పాటలతో మ్యూజిక్ లవర్స్‌ను రంజింపజేశాడు. అయితే మార్టిన్ కాన్సర్ట్‌ను మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనికి టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రానే కారణం. అతడికి సారీ చెప్పేందుకు కొంతసేపు కాన్సర్ట్‌కు బ్రేక్ ఇచ్చాడు మార్టిన్. అసలేం జరిగింది? క్షమాపణలు ఎందుకు చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
బుమ్రా సీరియస్!
ముంబైలో కోల్డ్ ప్లే బ్యాండ్ నెక్స్ట్ లెవల్‌లో సందడి చేసింది. శనివారంతో పాటు ఆదివారం కూడా సింగర్లు హల్‌చల్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపేందకు స్టేజ్ వెనుక జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడని.. అతడు బౌలింగ్ చేసేందుకు కొద్దిసేపు ఆపక తప్పదని మార్టిన్ అన్నాడు. అయితే అది నిజం కాదంటూ బుుమ్రాకు సారీ చెప్పాడు. ‘ఇది సీరియస్ విషయం. శనివారం నాడు షో టైమ్‌లో బుమ్రా అడిగాడని నేను చెప్పింది నిజం కాదు. అబద్ధం చెప్పినందుకు సారీ. దీనిపై అతడు సీరియస్ అయ్యాడు. తన పేరును మా షోలో వాడుకోవడం కరెక్ట్ కాదన్నాడు. కాబట్టి వరల్డ్ బెస్ట్ బౌలర్‌ను మేం గౌరవిస్తాం’ అని క్రిస్ మార్టిన్ చెప్పుకొచ్చాడు.
ఎంతో ఇష్టం!
బుమ్రా అంటే మాకెంతో ఇష్టం.. అతడి కోసం ఈ వీడియో ప్లే చేస్తున్నామంటూ.. గతేడాది ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో బ్యాటర్ ఓలీ పాప్‌ను అతడు క్లీన్‌బౌల్డ్ చేసిన క్లిప్‌ను ప్రదర్శించాడు క్రిస్ మార్టిన్. బుమ్రా పేరును జోక్ కోసం వాడినందుకు, అబద్ధం చెప్పినందుకు అతడు సారీ చెప్పాడు. అయితే బుమ్రా బౌలింగ్ వీడియోతో అతడికి రెస్పెక్ట్ ఇవ్వడం, అందుకోసం కాన్సర్ట్‌ను ఆపడం హైలైట్ అనే చెప్పాలి. బహుశా ఓ పాప్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో బౌలింగ్ వీడియో ప్రదర్శించడం ఇదే తొలిసారి కావొచ్చు అని ఇది చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
నీరజ్ చోప్రా పెళ్లి వేడుక పిక్స్ వైరల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి