Share News

Team India: ఎవరి మాట వినాలి.. టీమిండియాలో ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్..

ABN , Publish Date - Jan 01 , 2025 | 08:54 PM

IND vs AUS: భారత్.. క్రికెట్‌లో సూపర్ పవర్. మన జట్టుతో మ్యాచ్ అంటే బడా టీమ్స్ కూడా షేక్ అవుతాయి. రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్లు ఎక్కడ చిరుతల్లా తమ మీద దూకుతారోనని భయపడతాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అంతర్గత సమస్యలు జట్టును మరో పాకిస్థాన్‌లా మార్చేలా ఉన్నాయి.

Team India: ఎవరి మాట వినాలి.. టీమిండియాలో ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్..
Team India

టీమిండియా.. క్రికెట్‌లో సూపర్ పవర్. మన జట్టుతో మ్యాచ్ అంటే బడా టీమ్స్ కూడా షేక్ అవుతాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లు ఎక్కడ చిరుతల్లా తమ మీద దూకుతారోనని భయపడతాయి. ఎంతటి బిగ్ మ్యాచైనా, ఎలాంటి ప్రెజర్ ఉన్నా ట్రోఫీలను తమ నుంచి లాగేసుకుంటారని వణుకుతారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బయటి జట్లతో పోరాటం కంటే సొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే మెన్ ఇన్ బ్లూకు పెద్ద తలనొప్పిగా మారింది. అంతర్గత సమస్యలు జట్టును మరో పాకిస్థాన్‌లా మార్చేసేలా ఉన్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్ వివాదం మన డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎలా ఉందనేది బయటపెట్టేసింది. దీంతో అసలు జట్టులో ఎవరి మాట నడుస్తోంది? వెనుక నుంచి చక్రం తిప్పుతోంది ఎవరు? అనే డిస్కషన్స్ మొదలయ్యాయి.


చక్రం తిప్పుతోంది ఎవరు?

మెల్‌బోర్న్ టెస్ట్ ముగిసిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఫైట్ జరిగిందన్న వార్త క్రికెట్ వర్గాల్లో హల్‌చల్‌గా మారింది. న్యాచురల్ గేమ్ పేరుతో అడ్డగోలు షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటూ టీమ్ పరాజయానికి కారణం అవుతున్నారంటూ రిషబ్ పంత్ సహా పలువురు సీనియర్ల మీద గంభీర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాలని.. ఇక మీదట తన మాట వినేవాళ్లు టీమ్‌లో ఉండాలి లేదంటే బయటకు వెళ్లాలంటూ గౌతీ వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. దీంతో గంభీర్ మాట వినాలా? లేదా కెప్టెన్ రోహిత్ శర్మ మాట వినాలా? అనేది ఇతర ప్లేయర్లకు డైలమాగా మారిందట.


ఇలా అయిపోయిందేంటి?

బీసీసీఐలో గంభీర్ అంటే పడని కొందరు పెద్దలు చక్రం తిప్పుతున్నారని.. వాళ్లు చేస్తున్న పాలిటిక్స్ వల్ల జట్టులో చీలికలు వచ్చాయనే పుకార్లు వస్తున్నాయి. దీంతో భారత డ్రెస్సింగ్ రూమ్ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పడం కష్టంగానే ఉంది. ఇది చూసిన నెటిజన్స్.. నిన్నటి వరకు పవర్‌ఫుల్ టీమ్‌గా అందర్నీ ఓ ఆటాడించిన భారత్.. ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి అంటూ ఆవేదన చెందుతున్నారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ కూర్చొని జట్టును సెట్ చేయాలని.. తిరిగి అందరూ ఒక్కతాటి మీదకు వస్తే మనకు తిరుగుండదని చెబుతున్నారు.


Also Read:

కొత్త ఏడాది తొలి రోజే మ్యాక్స్‌వెల్ సంచలనం.. ఇది క్యాచ్ ఆఫ్ ది ఇయర్

టీమిండియాకు నయా కోచ్.. గంభీర్ పోస్టు ఊస్టే..

ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

టీమిండియాలో ఇంటి దొంగ

టీమ్‌లో నుంచి వెళ్లిపో.. పంత్‌కు గంభీర్ వార్నింగ్

For More Sports And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 09:12 PM