Share News

Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో గంభీర్ ఫైట్.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..

ABN , Publish Date - Jan 01 , 2025 | 02:08 PM

Team India: గెలుపు కిక్ ఇస్తే.. ఓటమి నిరాశను మిగులుస్తుంది. విజయం అన్ని బాధలు, ఇబ్బందులు మర్చిపోయేలా చేస్తే.. ఫెయిల్యూర్ సమస్యలన్నింటినీ బయటపెడుతుంది. అప్పటివరకు జాలీగా ఉన్న వాతావరణం కాస్తా కోపం, నిరాశ, నిస్పృహతో నెగెటివ్‌గా మారుతుంది. ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అలాగే ఉంది.

Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో గంభీర్ ఫైట్.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..
Gautam Gambhir

IND vs AUS: గెలుపు కిక్ ఇస్తే.. ఓటమి నిరాశను మిగులుస్తుంది. విజయం అన్ని బాధలు, ఇబ్బందులు మర్చిపోయేలా చేస్తే.. ఫెయిల్యూర్ సమస్యలన్నింటినీ బయటపెడుతుంది. అప్పటివరకు జాలీగా ఉన్న వాతావరణం కాస్తా కోపం, నిరాశ, నిస్పృహతో నెగెటివ్‌గా మారుతుంది. ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అలాగే ఉంది. ఒక వైఫల్యం తర్వాత మరో వైఫల్యం జట్టును గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. న్యూజిలాండ్ సిరీస్‌లో వైట్‌వాష్ అయి నెల గడవక ముందే మరో ఆసీస్ చేతుల్లో సిరీస్‌ కూడా పోగొట్టుకునేలా ఉంది భారత్. మెల్‌బోర్న్ టెస్ట్ పరాభవంతో అభిమానులంతా డీలాపడ్డారు. ఈ తరుణంలో జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.


టీమ్‌లో ఉంటారా? పోతారా?

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌ గురించి ఇప్పుడు డిస్కషన్స్ ఊపందుకున్నాయి. రిషబ్ పంత్ సహా పలువురు ప్లేయర్లపై హెడ్ కోచ్ గౌతం గంభీర్ సీరియస్ అవడం చర్చనీయాంశంగా మారింది. న్యాచురల్ గేమ్ పేరుతో ఎలాపడితే అలా ఆడటం ఇక మీదట కుదరదంటూ పంత్ సహా పలువురు బ్యాటర్లపై గౌతీ ఫైర్ అయ్యాడని సమాచారం. టీమ్‌లో ఉండాలని అనుకుంటున్నారా? లేదా? అంటూ ఒక్కొక్కర్నీ ఏకిపారేశాడట. సీనియర్లు, జూనియర్లు అనేది కాదు.. టీమ్ అవసరాలకు తగినట్లు ఆడేవారే ఉండాలని.. మిగతావాళ్లు వెళ్లిపోవాలని స్పష్టం చేశాడట. ఇకపై కనికరం లేకుండా వ్యవహరిస్తానని.. టీమ్ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని గంభీర్ వార్నింగ్ ఇచ్చాడని వినిపిస్తోంది.


బహుత్ హో గయా!

‘బహుత్ హో గయా’ (ఇప్పటికే చాలా ఎక్కువైంది అని అర్థం) అంటూ సీనియర్ ప్లేయర్లపై గంభీర్ అసహనం వ్యక్తం చేశాడని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఇంకెన్ని మ్యాచుల్లో ఓడతారు.. ఎన్ని సార్లు ఫెయిల్ అవుతారు? మీరు మారరా? అంటూ ప్లేయర్లపై ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. ఇదే తరుణంలో మరో న్యూస్ కూడా వస్తోంది. వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయాలంటూ సెలెక్టర్లను కోరాడట గౌతీ. సిరీస్‌కు ముందు సెలెక్టర్లతో ఈ విషయంపై ఫైట్ చేశాడట. అయితే అతడు ఎంత చెప్పినా పుజారాను ఎంపిక చేయలేదట. అప్పటి నుంచి గరంగరంగా ఉన్న గౌతీ.. జట్టు 1-2తో వెనుకబడటంతో మరింత ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడట. ప్లేస్ గ్యారెంటీ అనే ధీమాతో కొందరు సీనియర్లు నచ్చినట్లు ఆడటంతో అతడి కోపం మరింత పెరిగిందని సమాచారం. జట్టులో ఈ మంటలు ఎప్పుడు చల్లారుతాయో, మళ్లీ విజయాల బాట ఎప్పుడు పడుతుందో చూడాలి.


Also Read:

ఆస్ట్రేలియా డ్రీమ్‌ టీమ్‌ కెప్టెన్‌ బుమ్రా

హైదరాబాద్‌ ఉత్కంఠ విజయం

సంతోష్‌ ట్రోఫీ విజేత బెంగాల్‌

For More Sports And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 02:12 PM