Hardik Pandya: కుర్రాడితో హార్దిక్ కొట్లాట.. బూతులు తిడుతూ..
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:21 PM
Indian Premier League: క్రికెట్ పిచ్‌పై ప్లేయర్ల కొట్లాట కామనే. ప్రతి మ్యాచ్‌లో కాదు గానీ ఇంటెన్స్ మ్యాచెస్‌లో ఆటగాళ్ల మధ్య పొట్లాటలు జరుగుతుంటాయి. అలాంటిదే ఐపీఎల్ తాజా సీజన్‌లోనూ చోటుచేసుకుంది.

క్రికెట్‌లో సీనియర్లకు జూనియర్లు రెస్పెక్ట్ ఇస్తుంటారు. అందునా ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లైతే వాళ్లతో మరింత పద్ధతిగా బాగా నడుచుకుంటారు. సీనియర్లతో జూనియర్లు గొడవపడిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. ఇంటెన్స్ మ్యాచెస్‌లో ఎమోషన్స్‌ను నియంత్రించుకోవడం కష్టమే. గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో అదే జరిగింది. స్టార్ ఆల్‌రౌండర్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో ఓ కుర్ర బౌలర్ కొట్లాటకు దిగాడు. అయితే ఇందులో కుర్రాడిది ఎంత తప్పుందో.. పాండ్యాదీ అంతే మిస్టేక్ ఉంది. మరి.. వాళ్లిద్దరి మధ్య అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
బూతుల దండకం
ముంబై ఇన్నింగ్స్ సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ టైమ్‌లో బౌలింగ్ చేస్తున్న సాయి కిషోర్ ఓ డాట్ బాల్ వేశాడు. బంతి వేశాక సైలెంట్‌గా వెళ్లిపోకుండా పాండ్యా వైపు సీరియస్‌గా చూశాడు సాయి కిషోర్. దీంతో ఎందుకు అలా చూస్తున్నావంటూ బూతులు తిట్టాడు హార్దిక్. ఏదో బూతు పదంతో అతడ్ని తిడుతూ కనిపించాడు. అయినా సాయి కిషోర్ అలాగే గంభీరంగా చూస్తూ ఉండిపోయాడు. ఒక దశలో ఇద్దరూ పిచ్ మధ్యలో ఒకర్నొకరు సీరియస్‌గా చూస్తుండటం, పాండ్యా బూతుల దండకం అందుకోవడంతో అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. సాయి కిషోర్ సీరియస్ అవ్వడం, హార్దిక్ తిట్టడం కరెక్ట్ కాదని.. ఇద్దరిదీ తప్పేనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకర్నొకరు హగ్ చేసుకొని ఫైట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు.
ఇవీ చదవండి:
నితీష్ రెడ్డికి సరికొత్త చాలెంజ్
ఐపీఎల్ ఓనర్లలో మోస్ట్ రిచ్ ఎవరంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి