Rohit Sharma: రోహిత్‌కు మరో షాక్.. బీజీటీకే అనుకుంటే చాంపియన్స్ ట్రోఫీలోనూ..
ABN , Publish Date - Jan 03 , 2025 | 07:48 PM
Rohit Sharma: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టైమ్ బాగోలేదు. అతడు ఏం చేసినా అంతా రివర్స్ అవుతోంది. అటు కెప్టెన్సీ నిర్ణయాల నుంచి ఇటు బ్యాటింగ్ వరకు అతడు ఏం చేసినా ఫెయిల్యూరే పలకరిస్తోంది. దీంతో సిడ్నీ టెస్ట్ తుది జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు.
IND vs AUS: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టైమ్ బాగోలేదు. అతడు ఏం చేసినా అంతా రివర్స్ అవుతోంది. అటు కెప్టెన్సీ నిర్ణయాల నుంచి ఇటు బ్యాటింగ్ వరకు అతడు ఏం చేసినా ఫెయిల్యూరే పలకరిస్తోంది. దీంతో సిడ్నీ టెస్ట్ తుది జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు. పేలవ ఫామ్ కారణంగా హిట్‌మ్యాన్ తనంతట తాను రెస్ట్ తీసుకొని మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని టీమిండియా మేనేజ్‌మెంట్ చెబుతున్నా.. అతడ్ని కావాలనే పక్కనబెట్టారని వినిపిస్తోంది. అతడి టెస్ట్ కెరీర్ ఇక ముగిసినట్లేనని.. ఇక మీదట వన్డేలకే పరిమితం అవుతాడని అంటున్నారు. ఈ సమయంలో రోహిత్‌కు బిగ్ షాక్ తగిలింది.
హార్దిక్‌కు పట్టాభిషేకం?
కొత్త ఏడాదిలో భారత క్రికెట్‌లో సంచలన మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోహిత్ లేకుండానే కీలకమైన సిడ్నీ టెస్టులో ఆడుతోంది టీమిండియా. హిట్‌మ్యాన్‌తో పాటు మరో సీనియర్ విరాట్ కోహ్లీ కూడా లాంగ్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. టీమిండియా వన్డే ఫార్మాట్‌కు సారథిగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు కూడా ప్రారంభించిందని తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను అతడ్ని కెప్టెన్‌గా చేసి.. ఆ తర్వాత పర్మినెంట్ సారథిగా కంటిన్యూ చేస్తారట.
2 ఫార్మాట్లకూ ఒకేసారి..!
ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలోనూ పాండ్యా సారథ్యంలోనే టీమిండియా ఆడుతుందని సమాచారం. దీంతో తన కంటే ఎంతో జూనియర్ అయిన హార్దిక్ కెప్టెన్సీలో, అదీ తాను బిల్డ్ చేసిన టీమ్‌లో రోహిత్ ఆడతాడా? లేదా టెస్టులతో పాటు 50 ఓవర్ల ఫార్మాట్‌కూ గుడ్‌బై చెబుతాడా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆఖరి టెస్టులో తనను డ్రాప్ చేయడంతో ఇప్పటికే రోహిత్ బాధలో మునిగిపోయాడు. ఒకవేళ హార్దిక్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తే అతడు త్వరలో రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం అక్కర్లేదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అయితే హిట్‌మ్యాన్ ఆడకపోయినా కోహ్లీ మాత్రం చాంపియన్స్ ట్రోఫీ తర్వాతే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలగాలనే ఆలోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.