Share News

Hardik Pandya: పాండ్యాకు మెంటల్ టార్చర్.. కైఫ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 09:08 AM

IPL 2025: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వేటకు సిద్ధమవుతున్నాడు. అవమానాలు పడిన చోటే అదరగొట్టాలని చూస్తున్నాడు. గేలి చేసిన చేతులతో జై కొట్టించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

Hardik Pandya: పాండ్యాకు మెంటల్ టార్చర్.. కైఫ్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya

ఎంత తోపు ఆటగాడి కెరీర్‌లోనైనా ఓ బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. ఆ సమయంలో వాళ్లు ఏం చేసినా అది తప్పులాగే కనిపిస్తుంది. వాళ్లకు సంబంధం లేకపోయినా, మిస్టేక్స్ చేయకపోయినా.. అంతా వారిదే తప్పు అనే ముద్ర వేసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. సరిగ్గా ఏడాది కింద టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చి.. కెప్టెన్సీ తీసుకోవడంతో రోహిత్ శర్మ అభిమానులతో పాటు చాలా మంది ఎంఐ ఫ్యాన్స్ అతడ్ని విలన్‌గా చూశారు. బూ.. అంటూ ఎగతాళి చేశారు.


టార్గెట్ చేసి మరీ..

గ్రౌండ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి టాస్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని చోట్లా పాండ్యాను ఇబ్బంది పెట్టారు. అయితే ఆ ఫేజ్‌ నుంచి సక్సెస్‌ఫుల్‌గా బయటపడ్డాడు హార్దిక్. టీ20 వరల్డ్ కప్-2024తో పాటు రీసెంట్‌గా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి నయా హీరోగా అవతరించాడు. దీంతో ఈసారి ఐపీఎల్‌లో అతడికి ముంబై అభిమానులు, రోహిత్ ఫ్యాన్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికేలా ఉంది. అయితే ఒకప్పుడు అతడు పడిన వేదన గురించి తాజాగా సీనియర్ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్‌లో పాండ్యాను కావాలనే టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెట్టారంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.


కమ్‌బ్యాక్ అంటే ఇది..

ఎన్నో అవమానాలను హార్దిక్ ఎదుర్కొన్నాడని.. అతడ్ని కొందరు మెంటల్ టార్చర్ చేశారని కైఫ్ చెప్పాడు. అతడి కమ్‌బ్యాక్ స్టోరీ అద్భుతమని మెచ్చుకున్నాడు. అయితే ఫ్యాన్స్ ఎగతాళి చేయడం, అతడి గురించి కొందరు చెడుగా రాయడం దారుణమని సీరియస్ అయ్యాడు. ఆ టైమ్‌లో ప్లేయర్లు ఎంత బాధకు లోనవుతారో తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నాడు కైఫ్. అయినా వాటిని తట్టుకొని అతడు ఫైట్ చేశాడని.. భారత్‌కు వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు అందించాడని ప్రశంసించాడు. హార్దిక్ జీవితం మీద బయోపిక్ తీయొచ్చని వ్యాఖ్యానించాడు. ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగా ఉంటూ.. మీ బలాబలాలను నమ్ముకొని ధైర్యంగా పోరాడటం ఎలాగో పాండ్యా అందరికీ చూపించాడని తెలిపాడు కైఫ్.


ఇవీ చదవండి:

ఆ నిబంధన మార్చం: బీసీసీఐ

ఆ ఒక్క మ్యాచ్‌కి.. ముంబై కెప్టెన్‌ సూర్య

భరణం రూ. 4.75 కోట్లు?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2025 | 09:14 AM