Hardik Pandya: ప్లీజ్.. నా కోసం ఆ పని చేయండి.. ఫ్యాన్స్‌కు పాండ్యా రిక్వెస్ట్
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:10 PM
Mumbai Indians: ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. తన కోసం ఆ ఒక్క పని చేయాలని కోరాడు. ఇంతకీ ఏంటా పని అనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్ ఆఖర్లో స్లో ఓవర్ రేట్ కారణంగా బ్యాన్ పడటంతో ఈసారి తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు హార్దిక్. ఈ నేపథ్యంలో తన స్థానంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడని తెలిపాడు. ఆ తర్వాతి మొత్తం మ్యాచులకు తానే సారథిగా ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. ఈ సీజన్ మీద భారీ ఆశలు ఉన్నాయని.. తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. నేషనల్ టీమ్‌కు పలు ఫార్మాట్లలో కెప్టెన్స్‌గా ఉన్న రోహిత్-సూర్య-బుమ్రా తనకు అండగా ఉన్నారని.. ఇక భయమెందుకని పేర్కొన్నాడు. అనంతరం లాస్ట్ ఐపీఎల్‌లో ఎదురైన చేదు అనుభవాలపై రియాక్ట్ అయ్యాడు.
ఎంకరేజ్‌మెంట్ అదిరిపోవాలి
గత ఐపీఎల్ సమయంలో కెప్టెన్సీ మార్పు కారణంగా హార్దిక్‌ను బూ.. అంటూ సొంత అభిమానులే ఎగతాళి చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి టోటల్ చేంజ్ కావాలన్నారు. ఫ్యాన్స్ నుంచి ఫుల్ ఎంకరేజ్‌మెంట్, సపోర్ట్ తాను కోరుకుంటున్నానని పాండ్యా తెలిపాడు. టాస్, బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు తనను చీర్ చేయాలని కోరాడు. తాను ఫోర్ కొట్టినా, సిక్స్ బాదినా ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. ముంబై మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చే వాంఖడే మైదానంలో ఎంఐ జెండా తప్ప ఇంకే టీమ్ జెండా కనిపించొద్దని స్పష్టం చేశాడు. మొత్తం ముంబై అభిమానులు, జెండాలతో స్టేడియం నిండిపోయేలా చూడాలని కోరాడు. ఆ రేంజ్‌లో ఫ్యాన్స్ నుంచి మద్దతు, ప్రేమ, అభిమానం లభించాలని తాను కోరుకుంటున్నానని వివరించాడు పాండ్యా. ఎంఐ అభిమానుల నుంచి ఎంకరేజ్‌మెంట్ అదిరిపోవాలన్నాడు. ఆటగాళ్లంతా బెస్ట్ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నాడు.
ఇవీ చదవండి:
ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి