Hardik Pandya: హార్దిక్‌ను బకరా చేసిన బీసీసీఐ.. అందర్నీ వదిలేసి ఒక్కడ్నే..
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:58 PM
BCCI: భారత క్రికెట్ బోర్డు చేసిన పనికి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బలయ్యాడు. అందరికీ ఓ రూల్.. హార్దిక్‌కు మరో రూల్ అన్నట్లు పరిస్థితి తయారైంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ప్రతి ఐపీఎల్ సీజన్‌లో సరికొత్త రూల్స్‌ను తీసుకురావడం భారత క్రికెట్ బోర్డుకు అలవాటుగా మారింది. గేమ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడంతో పాటు అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు, వారిని సీట్లకు కట్టి పడేసేందుకు ఇలాంటి రూల్స్ ఉపయోగపడతాయి. అందుకే బీసీసీఐ ఇదే తోవలో ఈసారి కూడా కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే దీని వల్ల బలయ్యాడు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అనవసరంగా ఒక మ్యాచ్‌లో ఆడకుండా అతడిపై బ్యాన్ కూడా పడింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
కోత ఖాయం
ఐపీఎల్ మ్యాచుల్లో సకాలంలో ఓవర్లు పూర్తి చేయకపోతే స్లో ఓవర్ రేట్ కింద ఆ టీమ్ కెప్టెన్‌పై చర్యలు తీసుకుంటారు. దీని కింద మ్యాచ్ ఫీజులో కోత వేయడం లాంటివి చేస్తుంటారు. ఇదే కోవలో గత ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్‌లో టైమ్‌కు ఓవర్లు పూర్తి చేయలేకపోవడంతో సారథి పాండ్యాపై బ్యాన్ వేశారు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో అతడు తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం అతడ్ని మరింతగా నిరాశకు గురిచేస్తోంది.
నో బ్యాన్
ఇక మీదట ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ విషయంలో బ్యాన్ లాంటివి చేయొద్దని బీసీసీఐ డిసైడ్ అయిందట. స్లో ఓవర్ రేట్ కింద డీమెరిట్ పాయింట్స్ విధిస్తారట. లెవల్ 1 నేరం కింద మ్యాచ్ ఫీజులో 25 నుంచి 75 శాతం కోత వేస్తారట. అదే లెవల్ 2 నేరం చేసినట్లు రుజువైతే 4 డీమెరిట్ పాయింట్లు విధిస్తారట. దీని కింద మ్యాచ్ ఫీజులో 100 శాతం పెనాల్టీ వేస్తారట. కానీ స్లో ఓవర్ రేట్ కింద మ్యాచ్ బ్యాన్ మాత్రం ఉండదట. దీంతో హార్దిక్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ రూల్ ఏదో ముందే తెచ్చి ఉంటే.. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌కు పాండ్యా దూరమయ్యే వాడు కాదు కదా అని అంటున్నారు. ఇది చూసిన నెటిజన్స్.. రూల్స్ పేరుతో అందర్నీ సేఫ్ చేశారని.. పాండ్యాను ఒక్కడ్ని బలి చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మొదటి రోజే IPL ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి