ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. కాటేరమ్మ కొడుకుల జాతర.. ఇది ఎస్‌ఆర్‌హెచ్ మాస్టర్‌స్ట్రోక్
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:22 PM
Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అద్భుతం చేశాడు. అయితే ఈసారి గ్రౌండ్‌లో కాదు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.

భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు గుడ్ టైమ్ నడుస్తోంది. ఇప్పుడు అతడు పట్టిందల్లా బంగారం అవుతోంది. బరిలోకి అడుగు పెడితే భారీ సెంచరీలతో అదరగొడుతున్న అభిషేక్.. బంతి చేతపడితే వికెట్ల మీద వికెట్లు తీస్తూ మ్యాచులు వన్‌సైడ్ చేసేస్తున్నాడు. అతడ్ని చూస్తేనే ప్రత్యర్థి జట్లు వణికిపోతున్నాయి. ఎక్కడ తమ మీద వచ్చి పడతాడోనని భయపడుతున్నాయి. అలాంటి అభిషేక్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రప్పా రప్పా అంటూ దూసుకెళ్తున్నాడు. అతడితో పాటు మరో కాటేరమ్మ కొడుకు ట్రావిస్ హెడ్ కూడా ర్యాంకింగ్స్‌లో పరుగులు పెడుతున్నాడు. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం..
ర్యాంకుల్ని కుమ్మేశారు!
తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది ఐసీసీ. ఇందులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. 855 పాయింట్లతో అతడు తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ లిస్ట్‌లో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 829 రేటింగ్ పాయింట్లతో హెడ్ తర్వాతి పొజిషన్‌లోకి దూసుకొచ్చాడతను. ఇంతకుముందు 40వ స్థానంలో ఉన్న అభిషేక్.. ఇంగ్లండ్ సిరీస్‌లో దుమ్మురేపడంతో ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకొని టాప్-2కి చేరుకున్నాడు. అతడి తర్వాతి స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మ (803 పాయింట్లు) ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ (738) 5వ స్థానంలో ఉన్నాడు. ఇది చూసిన నెటిజన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు ఓపెనర్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారని.. ఇక ఐపీఎల్-2025లో ఒక్కో టీమ్‌కు దబిడిదిబిడేనని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
పోయిన చోటే వెతుక్కుంటున్న వరుణ్.. విధినే ఎదిరించిన యోధుడు
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే
మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి