Share News

IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టీ20.. భారత ప్లేయింగ్ 11లో మార్పులు.. వాళ్లు ఔట్

ABN , Publish Date - Jan 30 , 2025 | 06:55 PM

India Playing 11: మూడో టీ20లో ఇంగ్లండ్ చేతుల్లో ఓడిన యువ భారత్ కసి మీద ఉంది. పర్యాటక జట్టును ఓ పట్టు పట్టాలని చూస్తోంది. నాలుగో మ్యాచ్‌లో ఆ టీమ్ ఆట కట్టించాలని భావిస్తోంది.

IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టీ20.. భారత ప్లేయింగ్ 11లో మార్పులు.. వాళ్లు ఔట్
India Playing 11

యువకులతో నిండిన టీమిండియా ఇప్పుడు ఫుల్ కసి మీద ఉంది. మూడో టీ20లో తమను ఓడించిన ఇంగ్లండ్ జట్టును దెబ్బ కొట్టాలని అనుకుంటోంది. పుణె వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగే నాలుగో మ్యాచ్‌లో బట్లర్ సేన బెండు తీయాలని భారత్ భావిస్తోంది. అన్ని రంగాల్లోనూ రాణించి.. ఘనవిజయంతో సిరీస్‌ను పట్టేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆఖరి టీ20లో ప్రయోగాలు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అనుకుంటోంది. దీంతో ఈ మ్యాచ్‌ మీద ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రేపటి టీ20లో మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ ఎలెవన్‌ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..


రింకూ రాక!

నాలుగో టీ20 భారత జట్టులో కొన్ని సంచలన మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. గాయంతో చివరి రెండు మ్యాచులకు దూరమైన మహాబలుడు, పించ్ హిట్టర్ రింకూ సింగ్ రీఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. అతడు ఫుల్ ఫిట్‌గా ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొషేట్ చెప్పాడని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ రింకూ బరిలోకి దిగడం ఖాయమని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అతడితో పాటు ఇంకా జట్టులో మరో మార్పు పక్కా అని తెలుస్తోంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆడతారు.


ఇద్దరు ఔట్!

హైదరాబాదీ తిలక్ వర్మ ఫస్ట్ డౌన్‌‌లో దిగుతాడు. ఎప్పటిలాగే సారథి సూర్యకుమార్ యాదవ్ సెకండ్ డౌన్‌లో ఆడతాడు. ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు వస్తాడు. మిడిలార్డర్‌ను అతడితో కలసి రింకూ సింగ్ నడిపించే అవకాశం ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆడే చాన్స్ ఉంది. అయితే సుందర్, ధృవ్ జురెల్‌లో ఒకరికే చాన్స్ దక్కొచ్చు. రింకూ జట్టులోకి వస్తే రమణ్‌దీప్ సింగ్ బెంచ్‌కు పరిమితం అవుతాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి వ్యవహరిస్తాడు. మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు చూసుకుంటారు.

భారత జట్టు (అంచనా):

సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్/ధృవ్ జురెల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి.


ఇదీ చదవండి:

నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 06:55 PM