Jasprit Bumrah: బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..
ABN , Publish Date - Jan 03 , 2025 | 02:45 PM
Sydney Test: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో పెట్టుకోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. అతడ్ని రెచ్చగొడితే తమ పని ఫినిష్ అవుతుందని వణుకుతుంటారు. అయితే ఓ బచ్చా బ్యాటర్ మాత్రం బుమ్రా అయితే ఏంటి అన్నట్లు భారత సీమర్‌ను రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
IND vs AUS: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో పెట్టుకోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. అతడ్ని రెచ్చగొడితే తమ పని ఫినిష్ అవుతుందని వణుకుతుంటారు. అతడు చెలరేగితే సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ ముగించేస్తాడని.. క్షణాల్లోనే రిజల్ట్ తారుమారు చేస్తాడని అందరికీ తెలుసు. అందుకే బుమ్రాకు సాధ్యమైనంత డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తుంటారు. ఎలాగోలా అతడి స్పెల్ ఆడేస్తే చాలు.. మ్యాచ్ తమదేనని భావిస్తుంటారు. భారత స్పీడ్‌స్టర్‌కు అందరూ ఇంత భయపడుతుంటే ఓ బచ్చా బ్యాటర్ మాత్రం బుమ్రా అయితే ఏంటి? అన్నట్లు రెచ్చగొట్టాడు. ఏం చేస్తావంటూ వాదులాటకు దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
భలే బుద్ధి చెప్పాడు!
మెల్‌బోర్న్ టెస్ట్‌లో మొదలైన బుమ్రా-సామ్ కోన్స్టాస్ రైవల్రీ సిడ్నీ టెస్ట్‌లోనూ కంటిన్యూ అవుతోంది. టాప్ పేసర్‌ను కావాలనే రెచ్చగొడుతున్నాడు ఆసీస్ యంగ్ ఓపెనర్. అయితే బుమ్రా తనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోసారి కోన్స్టాస్‌కు రుచి చూపించాడు. వెంటనే వికెట్ తీసి అతడికి బుద్ధి చెప్పాడు. ఇదంతా ఆఖరి టెస్ట్ తొలి రోజు ఎండింగ్‌లో జరిగింది. తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారీ స్కోరు చేయడంలో ఫెయిలైంది. 72.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కంగారూలు 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులతో రోజును ముగించారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఇంట్రెస్టింగ్ ఫైట్ నడించింది. బుమ్రాతో గొడవకు దిగాడు కోన్స్టాస్.
వాటే రివేంజ్..
మొదటి రోజు ఆఖరి ఓవర్ వేసేందుకు బుమ్రా రనప్ తీసుకుంటున్న సమయంలో అతడ్ని రెచ్చగొట్టాడు కోన్స్టాస్. దీంతో భారత పేసర్ కూడా అతడి వైపు ఉరిమి చూశాడు. దీంతో ఏంటి.. నీ ప్రాబ్లమ్ అంటూ మళ్లీ బుమ్రాను ఏదో అన్నాడు. దీంతో అంపైర్ కలుగజేసుకొని ఇద్దర్నీ కూల్ చేశాడు. వీళ్ల పని పట్టాలని ఫిక్స్ అయిన బుమ్రా.. తర్వాతి బంతికే ఖవాజాను బలిగొన్నాడు. స్టన్నింగ్ డెలివరీతో అతడ్ని ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా భారత ఆటగాళ్లంతా కోన్ట్సాస్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి అతడ్ని భయపెడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. బుమ్రా కూడా చూడు.. తాను పగబడితే ఇలాగే ఉంటుంది అన్నట్లు అతడి పైపైకి వెళ్లాడు. బుమ్రాతో పాటు మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఆసీస్ బ్యాటర్‌ను ట్రోల్ చేశాడు. దీంతో దెబ్బకు దెబ్బ తీశారంటూ మెచ్చుకుంటుున్నారు ఫ్యాన్స్.