Share News

Jasprit Bumrah: మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:37 PM

IND vs AUS: టీమిండియా తాత్కాలిక సారథి జస్‌ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్ట్ రెండో రోజు హఠాత్తుగా బయటకు వెళ్లిపోయాడు. దీంతో అసలు పేసుగుర్రానికి ఏమైంది? అతడు మూడో రోజు ఆటకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.

Jasprit Bumrah: మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..
Jasprit Bumrah

Sydney Test: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు 185. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉన్న ఫామ్‌కు ఇది ఏమాత్రం సరిపోదు. మ్యాచ్ ఇక భారత్ చేజారినట్లేనని అంతా అనుకున్నారు. కంగారూలు భారీ స్కోరు బాదితే మ్యాచ్‌ మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి. అసలే 1-2తో సిరీస్‌లో వెనుకబడి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయే ప్రమాదంలో ఉంది మెన్ ఇన్ బ్లూ. ఈ సమయంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓవర్లు వేస్తూ వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును వణికిస్తున్న తాత్కాలిక సారథి, పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా హఠాత్తుగా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ అతడు గ్రౌండ్‌లోకి అడుగు పెట్టలేదు. దీంతో అసలు బుమ్రాకు ఏమైంది? మ్యాచ్‌కు కీలకంగా మారే మూడో రోజు అతడు బ్యాటింగ్, బౌలింగ్‌కు దిగుతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.


తిరిగొస్తాడా?

బుమ్రా ఇంజ్యురీపై భారత అభిమానుల్లో అయోమయం నెలకొంది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ సమయంలో బుమ్రా గ్రౌండ్‌ను విడిచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఏదైనా గాయం వల్ల వెళ్లిపోయాడేమో.. మెడికల్ టీమ్ ట్రీట్‌మెంట్ తర్వాత తిరిగొస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ మెడికల్ సిబ్బందితో కలసి అతడు స్కానింగ్‌కు వెళ్లాడని సమాచారం. దీన్ని ధృవపరుస్తూ అతడు స్టేడియంలోని కారులో వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుమ్రా స్కానింగ్ కోసం వెళ్లాడని తెలుస్తోంది. ఒకవేళ అందులో గాయం ఉన్నట్లు తేలితే మాత్రం మెన్ ఇన్ బ్లూకు బ్యాడ్‌న్యూస్ అవుతుంది.


కోహ్లీకి పగ్గాలు..

స్కానింగ్‌లో బుమ్రాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంజ్యురీలు లేవని వస్తే అభిమానులకు ఊరట కలుగుతుంది. సిరీస్ డిసైడర్‌గా మారిన మ్యాచ్‌లో బుమ్రా ఆడకపోతే భారత్‌కు కష్టమవుతుంది. అతడు మైదానాన్ని వీడటంతో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జట్టును నడిపించే బాధ్యతను మేనేజ్‌మెంట్ అప్పగించింది. కింగ్ తనదైన స్టైల్‌లో అగ్రెసివ్‌గా జట్టును నడిపించాడు. అందుబాటులో ఉన్న సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ రెడ్డి, జడేజాను అద్భుతంగా వినియోగించుకున్నాడు. అటాకింగ్ ఫీల్డింగ్ పెట్టి అదే తరహా లెంగ్త్స్‌లో బౌలింగ్ చేయించాడు. ఇది వర్కౌట్ అయింది. 181 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. సిరాజ్, ప్రసిద్ధ్ తలో 3 వికెట్లతో చెలరేగారు. నితీష్ 2 వికెట్లతో సత్తా చాటాడు.


ఇవీ చదవండి:

రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ సంచలన ప్రకటన..

రాష్ట్ర బ్యాడ్మింటన్‌ చీఫ్‌గా శ్రీధర్‌బాబు

రోహిత్‌కు ముందే చెప్పేశారా?

మరిన్ని క్రీడా వార్తలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 04 , 2025 | 01:37 PM