AFG vs ENG: కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్.. ఎంతటి యోధుడైనా ఓటమికి తలవంచాల్సిందే
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:52 PM
Joe Root: గెలుపు ఇచ్చే కిక్ ఒకలా ఉంటే.. ఓటమితో కలిగే బాధ మరోలా ఉంటుంది. రెండింటినీ సమానంగా చూడటం అంత ఈజీ కాదని మరోమారు ప్రూవ్ అయింది. ఫెయిల్యూర్‌ను తట్టుకోలేక నంబర్ వన్ క్రికెటర్ కన్నీటి పర్యంతం అవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా క్రికెటర్? కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏంటా కథాకమామీషు.. అనేది ఇప్పుడు చూద్దాం..

గెలుపు ఇచ్చే కిక్‌ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఓటమి ఇచ్చే బాధను మాత్రం తీసుకోలేరు. ఎవరూ ఓడాలని అనుకోరు. అందునా ఆటల్లో ఫెయిల్యూర్స్‌కు పెద్దగా చోటు ఉండదు. ఎంతటి ప్లేయరైనా ఓటమి వల్ల కలిగే బాధ, ఒత్తిడిని జయించడం చాలా కష్టం. ఓడినప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోవడం తోపు ఆటగాళ్లకు కూడా అసాధ్యమనే చెప్పాలి. తాజాగా ఇది మరోమారు నిరూపితమైంది. చిన్న జట్టు చేతిలో తన టీమ్ అనూహ్య పరాజయం పాలవడంతో నంబర్ వన్ క్రికెటర్ తట్టుకోలేకపోయాడు. చిన్న పిల్లాడిలా గుక్కపెట్టి ఏడ్చాడు. మరి.. ఎవరా క్రికెటర్? ఏంటా కథాకమామీషు? అనేది ఇప్పుడు చూద్దాం..
బాధ తట్టుకోలేక..
ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆఫ్ఘానిస్థాన్‌తో బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ 8 పరుగుల స్మాల్ మార్జిన్‌తో ఓటమిపాలైంది. ఆల్రెడీ ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన బట్లర్ సేన.. తాజాగా ఆఫ్ఘాన్ మీదా ఓడి ఇంటికి పయనమైంది. సెమీస్‌కు ముందే ఆ టీమ్ ప్రయాణం ముగిసింది. దీంతో రూట్ బాధ తట్టుకోలేకపోయాడు. నిన్నటి మ్యాచ్‌లో అతడు 111 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఆఖరి వరకు గెలుపు కోసం పోరాడాడు. అయినా టీమ్ ఓటమి చెందడంతో బాధ తట్టుకోలేక ఏడ్చేశాడు రూట్.
ఆఖరి వికెట్ పడగానే..
ఇంగ్లండ్ చివరి వికెట్ పడగానే డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. బట్లర్ బాధతో చూస్తూ ఉండిపోయాడు. అతడి పక్కనే ఉన్న రూట్ ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. పాపం రూట్.. ఎంత పోరాడినా అతడి టీమ్‌కు ఓటమి తప్పలేదని అంటున్నారు. ఒక్కడి వల్లే ఏదీ కాదని.. రూట్‌కు మిగిలిన సహచరులు కూడా సహకారం అందిస్తే ఇంగ్లండ్‌కు ఈ అవమానం తప్పేదని కామెంట్స్ చేస్తున్నారు. చాంపియన్ ప్లేయర్ కాబట్టి ఈ ఓటమి నుంచి అతడు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నారు. కాగా, మూడు ఫార్మాట్లలోనూ దుమ్మురేపుతున్న రూట్.. టెస్టుల్లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇవీ చదవండి:
జట్టుతో చేరిన మోర్నీ మోర్కెల్
తోటి బాక్సర్‌పై గుడ్డుతో దాడి!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి