IPL 2025 Kagiso Rabada: క్రికెట్ పేరు మార్చేయండి.. ఐపీఎల్‌పై రబాడ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:25 PM
GT: గుజరాత్ టైటాన్స్ ప్రధాన పేసర్ కగిసో రబాడ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అసలు క్రికెట్ అంటారా అంటూ ఐపీఎల్‌పై అతడు గరంగరం అయ్యాడు. రబాడ ఇంకా ఏమన్నాడంటే..

క్రికెట్ అంటే బ్యాట్‌కు బంతికి మధ్య సమతూకం ఉండాల్సిందే. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. రెండూ పోటాపోటాగా సాగితేనే చూసే ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ అందుతుంది. కానీ టీ20 ఫార్మాట్ వచ్చినప్పటి నుంచి వైట్ బాల్ క్రికెట్ బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారిపోయింది. ఐపీఎల్‌లో కూడా చాలా పిచ్‌లను బ్యాటింగ్ ఫ్రెండ్లీగా తయారు చేస్తుండటంతో 250 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా నమోదవుతున్నాయి. ఈ విషయంపై గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ తాజాగా రియాక్ట్ అయ్యాడు. అసలు దీన్ని క్రికెట్ అంటారా.. అంటూ అతడు ఐపీఎల్ నిర్వాహకులపై సీరియస్ అయ్యాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
సమతూకం తప్పనిసరి
ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో పిచ్‌లు చాలా ఫ్లాట్‌గా మారిపోతున్నాయని వాపోయాడు రబాడ. ప్రతి మ్యాచ్‌లో ఇదే పరిస్థితిని చూస్తున్నామని తెలిపాడు. దీని వల్ల ఆటలో మజా మిస్ అవుతోందన్నాడు స్టార్ పేసర్. దీన్ని క్రికెట్ అంటారు గానీ ఇకపై బ్యాటింగ్ అనే పేరు పెట్టి పిలవాలేమోనని అసహనం వ్యక్తం చేశాడు. హైస్కోరింగ్ గేమ్స్ వల్ల రికార్డులు బ్రేక్ అవడం బాగుంటుందని.. కానీ లోస్కోరింగ్ మ్యాచ్‌లు వద్దా అని ప్రశ్నించాడు రబాడ. బ్యాట్, బాల్‌కు మధ్య బ్యాలెన్స్ తప్పనిసరి అని.. ఆటలోని అందం మిస్ అవకుండా చూసుకోవాలని సూచించాడు. ప్రతిసారి హైస్కోర్లు లేదా ప్రతిసారి లోస్కోర్ మ్యాచులు వద్దని.. రెండింటినీ సమతూకం చేసుకుంటూ బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరాటాలు జరిగితే చూసేందుకు అద్భుతంగా ఉంటుందన్నాడు రబాడ. కాగా, పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతడు 4 ఓవర్లలో 41 పరుగులకు 1 వికెట్ తీశాడు.
ఇవీ చదవండి:
రాజస్తాన్, కోల్‌కతాలో వీళ్లే డేంజరస్
ఉప్పల్‌లో కొడితే బోడుప్పల్‌లో పడాలె
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి