Share News

Ashwani Kumar: ఆటో చార్జీ కోసం 30 రూపాయలు అడిగేవాడు.. కట్ చేస్తే ఐపీఎల్ హీరో

ABN , Publish Date - Apr 01 , 2025 | 02:23 PM

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు కొత్త హీరో దొరికాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మార్చేసే సత్తా గల ఆ ప్లేయర్.. ఇదే రీతిలో రాణిస్తే ఎంఐకి ఇక ఢోకా ఉండదని చెప్పొచ్చు.

Ashwani Kumar: ఆటో చార్జీ కోసం 30 రూపాయలు అడిగేవాడు.. కట్ చేస్తే ఐపీఎల్ హీరో
Mumbai Indians

పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామం అతడిది. క్రికెట్‌ అంటే ఆ కుర్రాడకి ఎంతో మక్కువ. కానీ పేద కుటుంబం. అయినా అతడు తన కలల్ని చంపుకోలేదు. అహర్నిశలు శ్రమిస్తూ మంచి పేసర్‌గా ఎదిగాడు. సైకిల్ మీదే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి వెళ్తూ ఆట కొనసాగించాడు. కొన్నిసార్లు వాహనదారుల నుంచి లిఫ్ట్స్ అడుగుతూ వెళ్లేవాడు. మరికొన్ని సార్లు ఆటో చార్జీల కోసం నాన్న దగ్గర రూ.30 అడిగేవాడు. ఇలా కొన్నేళ్లు చాలా కష్టపడ్డాడు. అయినా అతడి టాలెంట్‌ను కేకేఆర్, సీఎస్‌కే, రాజస్థాన్ జట్లు పట్టించుకోలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఐపీఎల్ నయా సెన్సేషన్‌గా మారాడా కుర్రాడు. అతడే ముంబై సంచలనం అశ్వనీ కుమార్.


ఎవరీ అశ్వనీ..

గాయం కారణంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో అతడి స్థానంలో కొత్త కుర్రాళ్లకు చాన్స్ ఇస్తోంది ముంబై ఇండియన్స్. అలా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో అశ్వనీ కుమార్ అనే యంగ్ లెఫ్టార్మ్ సీమర్‌ను ఆడించింది. అతడ్ని అపోజిషన్ టీమ్ లైట్ తీసుకుంది. కానీ అశ్వనీ మాత్రం చెలరేగిపోయాడు. 3 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అజింక్యా రహానె, రింకూ సింగ్ సహా మనీష్ పాండే, ఆండ్రూ రస్సెల్ లాంటి డేంజర్ బ్యాటర్లను అశ్వనీ ఔట్ చేశాడు.


ఫస్ట్ బాల్‌కే వికెట్

ఐపీఎల్‌ హిస్టరీలో డెబ్యూ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్వనీ కుమార్ రికార్డు సృష్టించాడు. వేసిన తొలి బంతికే రహానేకు పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత మరో 3 వికెట్లు తీశాడు. దీంతో అశ్వనీ పెర్ఫార్మెన్స్‌పై అతడి కుటుంబసభ్యులు స్పందించారు. ఎండనకా, వాననకా తన కొడుకు నానా కష్టాలు పడ్డాడని.. చార్జీ కోసం రూ.30 అడిగే స్థితి నుంచి ఐపీఎల్ ఆక్షన్‌లో రూ.30 లక్షలకు అమ్ముడయ్యే రేంజ్‌కు ఎదిగాడని అశ్వనీ తండ్రి హర్కేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. బుమ్రా, స్టార్క్‌ను అతడు రోల్ మోడల్స్‌గా తీసుకొని ఏళ్ల పాటు శ్రమించాడని ఆయన తెలిపాడు.


ఇదీ చదవండి:

కోహ్లీ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్

రైనా కావాలంటున్న సీఎస్‌కే

రోహిత్ సిక్స్‌కు దద్దరిల్లిన స్టేడియం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం చదవండి

Updated Date - Apr 01 , 2025 | 02:23 PM