Share News

Rahul-Hardik: రాహుల్ వల్ల తిట్లు తింటున్న హార్దిక్.. అసలు తప్పు అతడిదే

ABN , Publish Date - Feb 21 , 2025 | 03:34 PM

IND vs BAN: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు. కేఎల్ రాహుల్ చేసిన పనితో హార్దిక్ చిక్కుల్లో పడ్డాడు. అతడ్ని చూసి నేర్చుకోమంటూ స్టార్ ఆల్‌రౌండర్‌కు కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్స్. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..

Rahul-Hardik: రాహుల్ వల్ల తిట్లు తింటున్న హార్దిక్.. అసలు తప్పు అతడిదే
Team India

చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది టీమిండియా. బంగ్లాదేశ్‌తో దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది రోహిత్ సేన. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరకు రాణించడం.. బౌలింగ్‌లో వెటరన్ పేసర్ మహ్మద్ షమి, స్పిన్నర్ అక్షర్ పటేల్ అదరగొట్టడంతో వార్‌ను వన్ సైడ్ చేసేసింది మెన్ ఇన్ బ్లూ. అయితే రాహుల్ చేసిన ఒక పని వల్ల ఇప్పుడంతా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. బుద్ధి తెచ్చుకో అంటూ చేయని తప్పుకు అతడ్ని ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


రాహుల్ త్యాగం!

బంగ్లాతో మ్యాచ్‌లో గిల్ (101 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. అయితే ఒక దశలో అతడు శతకం మార్క్‌ను అందుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. భారత్ విజయానికి చేరువవడం, చేయాల్సిన పరుగులు తక్కువే ఉండటం, అవతల ఎండ్‌లో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ (41 నాటౌట్) మంచి ఊపులో ఉండటంతో మూడంకెల మార్క్ చేరుకోవడం కష్టమే అనిపించింది. కానీ రాహుల్ హాఫ్ సెంచరీని త్యాగం చేసి గిల్‌ కోసం నెమ్మదిగా ఆడాడు. అతడికి ఎక్కువగా స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే విషయం హార్దిక్‌ను చిక్కుల్లో పడేసింది. అప్పట్లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీని చేరుకోకుండా పాండ్యా అడ్డుకున్న తీరును ఇప్పుడు నెటిజన్స్ గుర్తుచేస్తున్నారు.


అస్సలు పట్టించుకోడు!

వెస్టిండీస్‌తో 2023లో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ గెలిచింది. ఆ సిరీస్‌లోని ఓ మ్యాచ్‌లో తిలక్ వర్మ (49 నాటౌట్) హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. పాండ్యా (20 నాటౌట్) ఆఖర్లో సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉన్నా తిలక్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా పాండ్యా సిక్స్ కొట్టడంతో అంతా షాక్ అయ్యారు. అందుకే ఇప్పుడు అతడి తప్పిదాన్ని నెటిజన్స్ మళ్లీ గుర్తుచేస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ప్లేస్‌లో పాండ్యా ఉండి ఉంటే పరిస్థితి విభిన్నంగా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. అతడు అవతలి బ్యాటర్ గురించి పట్టించుకోడని దుయ్యబడుతున్నారు.


ఇవీ చదవండి:

అక్షర్‌కు రోహిత్ బంపరాఫర్

నరకం నుంచి బయటపడ్డా.. ధనశ్రీ పోస్ట్

వీలైతే.. క్షమించేయండి బ్రో..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 03:36 PM