IND vs BAN: బంగ్లాపై బంపర్ విక్టరీ.. కేఎల్ రాహుల్‌కు అరుదైన అవార్డు
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:14 PM
KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన పురస్కారాన్ని గెలుచుకున్నాడు. అతడ్ని వరించిన ఆ అవార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చాంపియన్స్ ట్రోఫీ-2025 జర్నీని గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఈ విజయం టీమ్‌కు చాలా బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. బంగ్లాతో పోరులో భారత్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టడం శుభపరిణామమనే చెప్పాలి. అన్నింటికంటే కేఎల్ రాహుల్ టచ్‌లోకి రావడం మిడిలార్డర్‌కు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. అటు కీపింగ్‌లో క్యాచులతో మెరవడమే గాక బ్యాటింగ్‌లోనూ విలువైన రన్స్ జోడించి సత్తా చాటాడు రాహుల్. అందుకే అతడికి అరుదైన గౌరవం దక్కింది.
పాత సంప్రదాయం షురూ!
పాత సంప్రదాయాన్ని మళ్లీ మొదలుపెట్టింది టీమిండియా. వన్డే ప్రపంచ కప్-2023, టీ20 వరల్డ్ కప్-2024 టైమ్‌లో బెస్ట్ ఫీల్డర్ మెడల్స్ అందజేస్తూ ఆటగాళ్లలో జోష్ నింపింది బీసీసీఐ. ఇప్పుడే ఇదే ఆనవాయితీని తాజా చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వాలిటీ ఫీల్డింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్‌కు కోచ్ టి దిలీప్ మెడల్ అందించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో పాటు శుబ్‌మన్ గిల్ రేసులో నిలిచారు. అందులో రాహుల్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.
బిగ్ స్క్రీన్‌పై రాహుల్!
ఎప్పటిలాగే బెస్ట్ ఫీల్డర్ ఎవరనే విషయాన్ని కాస్త వినూత్నంగా ప్రకటించింది బీసీసీఐ. దుబాయ్ స్టేడియంలోని బిగ్ స్క్రీన్ మీద కేఎల్ రాహుల్ ఫొటోను ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. దీంతో అతడికి ఇతర ఆటగాళ్లు అభినందనలు తెలియజేశారు. రాహుల్‌కు మెడల్ అందించాడు రవీంద్ర జడేజా. ఈ సమయంలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు.. డోమ్ లైట్ల వెలుతురులో క్యాచులు అందుకోవడం చాలా కష్టమని అన్నాడు. వికెట్ల వెనుక కీపింగ్ చేయడం ఎప్పుడూ చాలెంజింగ్ విషయమని.. రాహుల్ లెగ్‌సైడ్ డైవింగ్ చేస్తూ చాలా బాగా ఫీల్డింగ్ చేశాడని మెచ్చుకున్నాడు దిలీప్.
ఇవీ చదవండి:
రాహుల్ వల్ల తిట్లు తింటున్న హార్దిక్..
నరకం నుంచి బయటపడ్డా.. ధనశ్రీ పోస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి