Share News

MS Dhoni-Sandeep Reddy: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ధోని.. ఈ కాంబో ఊహించలేదు..

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:09 PM

IPL 2025: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కొత్త అవతారంలో అభిమానులకు షాక్ ఇచ్చాడు. మాస్ గ్యాంగ్‌స్టర్‌‌గా ఊహించని లుక్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. దీని వెనుక మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉండటం విశేషం.

MS Dhoni-Sandeep Reddy: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ధోని.. ఈ కాంబో ఊహించలేదు..
MS Dhoni

సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు వినగానే ఇంటెన్స్ మూవీస్ గుర్తుకొస్తాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ఇంటెన్స్ డైరెక్టర్‌గా ఆయన గుర్తింపు సంపాదించాడు. ప్రేమ అనే ఎమోషన్‌ను ఆయన డెప్త్ వరకు వెళ్తూ చూపించే తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. దీనికి తోడు తనదైన శైలిలో మాస్ టచ్ ఇస్తూ, ఆల్ఫా మెన్ స్టైల్‌లో హీరో క్యారెక్టర్స్‌ను ఆయన ప్రెజెంట్ చేసే తీరు స్టన్నింగ్ అనే చెప్పాలి. ఇప్పుడు ఇదే అవతార్‌లో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీని చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు సందీప్ వంగా.


అచ్చం రణ్‌బీర్‌లా..

ఎంఎస్ ధోనీని మాస్ గ్యాంగ్‌స్టర్‌లా చూపించాడు సందీప్ వంగా. ఓ సైకిల్ సంస్థకు సంబంధించిన యాడ్ షూట్ కోసం వీళ్లిద్దరూ చేతులు కలిపారు. సాధారణంగా ధోనీని అంతా స్టైలిష్‌గా చూపిస్తారు. కానీ సందీప్ మాత్రం స్టైల్‌తో పాటు పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. యాటిట్యూడ్, అగ్రెషన్‌ను కలిపి కొంచెం ఫన్నీగానూ చూపించారు. బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘యానిమల్‌’లో రణ్‌బీర్ కపూర్‌‌ను పోలిన లుక్‌లో ధోని కారులో నుంచి దిగడం, నడుచుకుంటూ వెళ్లడం, సందీప్ వంగా విజిల్ వేయడం హైలైట్‌గా నిలిచాయి. ఈ యాడ్ వీడియో చూసిన ఫ్యాన్స్.. వీళ్ల కాంబోలో గనుక ఓ సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందేనని అంటున్నారు. పోతారు.. అంతా పోతారు అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని చెబుతున్నారు. కాగా, ఐపీఎల్-2025 కోసం నెట్స్‌లో భీకరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు మాహీ. సీఎస్‌కేకు మరో కప్పు అందించాలని కసిగా సాధన చేస్తున్నాడు.


ఇవీ చదవండి:

ధోని గిఫ్ట్‌కు షాకైన అశ్విన్

యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్

ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2025 | 04:15 PM