MS Dhoni Record: మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది.. ధోని కెరీర్‌లో గుర్తుండిపోయే ఫీట్
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:33 PM
Suresh Raina: సీఎస్‌కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. చెన్నై మాజీ బ్యాటర్ సురేష్ రైనా పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డ్‌ను అతడు బద్దలుకొట్టాడు.

ఎన్నో ఆశలతో సొంతగడ్డ మీద వరుసగా రెండో విజయం సాధించాలని బరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్. చిరకాల ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మరోమారు చిత్తు చేయాలని అనుకుంది. సీఎస్‌కేదే విజయమని చాలా మంది డిసైడ్ అయ్యారు. కానీ అనూహ్యంగా సొంతగడ్డపై చెపాక్ స్టేడియంలో 50 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది ఎల్లో ఆర్మీ. అయితే మ్యాచ్ పోయినా గానీ ఓ క్రేజీ రికార్డును మాత్రం తన పేరు మీద రాసుకున్నాడు సీఎస్‌కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని. మరి.. ఆ రికార్డు ఏంటి.. దాని ప్రత్యేకత ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
రైనాను దాటేసి..
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు ఎంఎస్ ధోని. ఆర్సీబీతో మ్యాచ్‌లో 16 బంతుల్లో 30 పరుగులు చేసిన మాహీ.. 3 బౌండరీలు, 2 భారీ సిక్సులు బాదాడు. అతడు ఇంకాస్త ముందే బ్యాటింగ్‌కు దిగి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. ధనాధన్ షాట్లతో విరుచుకుపడిన మాహీ.. ఈ క్రమంలో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 43 ఏళ్ల మాహీ.. సీఎస్‌కే తరఫున 4,699 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఎంత చేసినా..
సీఎస్‌కే టీమ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు ధోని. గతంలో సురేష్ రైనా (171 ఇన్నింగ్స్‌ల్లో 4,687 పరుగులు) పేరిట ఈ రికార్డు ఉండేది. నిన్నటి మ్యాచ్‌తో దీన్ని బ్రేక్ చేసేశాడు ధోని. అతడి సుదీర్ఘ కెరీర్‌లో ఈ రికార్డు ఎప్పటికీ గుర్తుంటుందనే చెప్పాలి. ఇక, నిన్నటి మ్యాచ్‌లో ఎంత చేసినా చివరకు సీఎస్‌కేను గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు లెజెండ్. అతడు లేట్‌గా బ్యాటింగ్‌కు రావడమే ఆ టీమ్ కొంపముంచిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై
సీఎస్‌కేను ఓడించిన ధోని.. చిన్న తప్పుతో..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి