Share News

Nitish Kumar Reddy: ఆసీస్ వెన్ను విరిచిన నితీష్ రెడ్డి.. బౌలింగ్ అంటే ఇది

ABN , Publish Date - Jan 04 , 2025 | 07:10 PM

IND vs AUS: టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. బ్యాట్‌ చేతపడితే భారీ ఇన్నింగ్స్‌లతో మ్యాచుల్ని మలుపు తిప్పుతున్న తెలుగోడు.. బంతి అందుకున్నా వికెట్లు తీస్తూ మ్యాజిక్ చేస్తున్నాడు.

Nitish Kumar Reddy: ఆసీస్ వెన్ను విరిచిన నితీష్ రెడ్డి.. బౌలింగ్ అంటే ఇది
Nitish Kumar Reddy

Sydney Test: టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. బ్యాట్‌ చేతపడితే భారీ ఇన్నింగ్స్‌లతో మ్యాచుల్ని మలుపు తిప్పుతున్న తెలుగోడు.. బంతి అందుకున్నా వికెట్లు తీస్తూ మ్యాజిక్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ సంగతి సరేసరి. ఏ రోల్ ఇచ్చినా, ఏ రెస్పాన్సిబిలిటీ అప్పగించినా నెరవేరుస్తూ కెప్టెన్‌తోనే కాదు.. అభిమానులతోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు. టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానేనని నిరూపించుకుంటున్నాడు. అలాంటోడు మరోమారు చెలరేగాడు. బంతి చేత పట్టి ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. నిప్పులు చెరిగే బంతులతో కంగారూలను వణికించాడు. మీడియం పేసర్ అని పొరపడితే ఊరుకోనని.. తనలో నిఖార్సైన స్పీడ్‌స్టర్ ఉన్నాడని ప్రూవ్ చేశాడు. బ్యాట్‌తోనే కాదు.. బంతితోనూ తాను గేమ్ ఛేంజర్‌నేనని చూపించాడు. బౌలింగ్ అంటే ఇది అనేలా నితీష్ పెర్ఫార్మ్ చేశాడు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


స్టార్ పేసర్ల రేంజ్‌లో..

సిడ్నీ టెస్ట్‌లో బంతితో చెలరేగాడు నితీష్ రెడ్డి. 7 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ రెండో రోజు కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా పలు ఓవర్లు బౌలింగ్ వేసి బయటకు వెళ్లిపోయాడు. నొప్పి కారణంగా గ్రౌండ్‌ను వీడి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. స్కానింగ్స్ కోసం అతడ్ని మెడికల్ టీమ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో బుమ్రా లేకుండానే బౌలింగ్ కంటిన్యూ చేసింది టీమిండియా. అతడి స్థానంతో సారథ్య పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. టీమ్‌ను కసిగా నడిపించాడు. అటాకింగ్ ఫీల్డ్ సెట్‌తో ఆసీస్ బ్యాటర్లకు పోయించాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణకు తోడుగా నితీష్‌ను రంగంలోకి దింపాడు. అది భలే వర్కౌట్ అయింది.


వాటే మాస్టర్‌స్ట్రోక్!

బుమ్రా లేని లోటు కనిపించకుండా భారత బౌలింగ్ సాగింది. సిరాజ్-ప్రసిద్ధ్ కలసి టాపార్డర్, మిడిలార్డర్ పనిపట్టారు. స్టీవ్ స్మిత్ నుంచి అలెక్స్ క్యారీ వరకు ఒక్కొక్కర్నీ టార్గెట్ చేసి ఔట్ చేశారు. అద్భుతమైన బంతులతో భయపెట్టారు. అయితే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి బ్యాటింగ్ చేయగల లోయరార్డర్ ఉండటంతో కంగారూలు భారీ స్కోరు చేస్తారని అంతా భావించారు. ఈ సమయంలో నితీష్‌ను దింపి మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చాడు కోహ్లీ. అతడితో పర్ఫెక్ట్ ఏరియాల్లో ప్లాన్ ప్రకారం ఫీల్డ్ సెట్ చేసి బౌలింగ్ చేయించాడు. తెలుగోడు క్వాలిటీ పేస్, సరైన్ లైన్‌లో బౌలింగ్ చేస్తూ కమిన్స్, స్టార్క్‌ను వెనక్కి పంపాడు. పిచ్ నుంచి పేస్, బౌన్స్‌కు మద్దతు దొరకడంతో డెడ్లీ డెలివరీస్‌తో కంగారూలను వణికించాడు. దీంతో భారత్ స్కోరుకు మరో నాలుగు పరుగుల దూరంలోనే ఆగిపోయింది ఆసీస్.


ఇవీ చదవండి:

టీమిండియా స్టార్లకు కలసిరాని మ్యారేజ్.. సోలో బతుకే సో బెటర్

టీమిండియా గేమ్ ఓవర్.. రాజు లేని రాజ్యం అయిపోయింది..

సింగిల్ కష్టమైన చోట సిక్సుల వర్షం.. పంత్ మాస్ బ్యాటింగ్

రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ సంచలన ప్రకటన..

మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..

మరిన్ని క్రీడా వార్తలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 04 , 2025 | 07:18 PM