PAK vs NZ: కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. కరాచీ స్టేడియంలో అంతా షాక్
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:54 PM
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్.. ఓపెనింగ్ మ్యాచ్‌లో సొంత ఆడియెన్స్‌ను షాక్‌కు గురిచేసింది. వింత పనితో అభిమానుల్ని భయపెట్టింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్ క్రికెట్‌లో పాకిస్థాన్‌కు డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఆ టీమ్ ఆట కంటే కూడా ఇతర విషయాలతోనే ఎక్కువగా చర్చల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోమారు ఓ వింత పనితో వార్తలకెక్కింది దాయాది. చాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యం ఇస్తున్న పాక్.. తొలి మ్యాచ్‌లో ఆడియెన్స్‌ను భయపెట్టింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో పాటు సొంత అభిమానుల్ని కూడా షాక్‌కు గురిచేసింది పాక్. ఇదంతా పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఘటన గురించి ఇప్పుడు మరింతగా తెలుసుకుందాం..
ఇదేం ట్విస్ట్ రా బాబు!
అప్పుడే పాక్-కివీస్ మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బ్లాక్‌కాప్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగుదామని ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు విల్ యంగ్, డెవాన్ కాన్వే సిద్ధమవుతున్నారు. ప్యాడ్స్ కట్టుకోవడం, హెల్మెట్ సరిచేసుకోవడంలో వాళ్లు బిజీగా ఉన్నారు. స్టేడియంలోని అభిమానులు మ్యాచ్ ఆరంభం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో హఠాత్తుగా గాల్లో నుంచి ఒక్కసారిగా పలు విమానాలు దూసుకెళ్లాయి. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం నేపథ్యంలో రంగుల్ని చిమ్ముకుంటూ వెళ్లసాగాయి.
పాక్‌కే సాధ్యం!
విమానాలు ఒక్కసారిగా గాల్లో ఎగరడం, భారీ శబ్దం రావడంతో కివీస్ ఆటగాళ్లు సహా మైదానంలోని ప్రేక్షకులు కూడా ఏం జరుగుతుందో తెలియక షాక్ అయ్యారు. ఏంటీ శబ్దం అంటూ భయపడ్డారు. తీరా అవి సెలబ్రేషన్స్‌లో భాగమని తెలిశాక నవ్వుల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. ఇలాంటివి పాక్‌కే సాధ్యం అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు మారరు అంటూ పాక్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. సొంత ఆడియెన్స్‌ను భయపెట్టడం మీ వల్లే అవుతుంది అంటూ ఎగతాళి చేస్తున్నారు.
ఇవీ చదవండి:
పాక్‌ను చితగ్గొట్టిన కివీస్ బ్యాటర్
అందరి నోటా ఒకటే మాట.. ఆ టీమ్‌దే కప్
ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్ ప్లేయర్: యువరాజ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి