Share News

Champions Trophy: ఆసీస్‌కు షాక్.. చాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే.. మనల్ని ఎవడ్రా ఆపేది..

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:14 PM

వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ కప్‌ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా చాంపియన్స్ ట్రోఫీని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలవాలని టాప్ టీమ్స్ అన్నీ ఉవ్విళ్లూరుతుంటాయి.

Champions Trophy: ఆసీస్‌కు షాక్.. చాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే.. మనల్ని ఎవడ్రా ఆపేది..
Champions Trophy 2025

వన్డేల్లో వరల్డ్ కప్‌ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా చాంపియన్స్ ట్రోఫీని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలవాలని టాప్ టీమ్స్ ఉవ్విళ్లూరుతుంటాయి. ఐసీసీ టోర్నీల్లో రుబాబు చూపించే ఆస్ట్రేలియా కూడా మెగా కప్పుపై కన్నేసింది. టీ20 ప్రపంచ కప్-2024ను మిస్ అవడంతో.. చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొని తమ ఆధిపత్యాన్ని మళ్లీ చాటాలని భావిస్తోంది. అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం రాసిపెట్టుకోండి.. ఈసారి కప్పు రోహిత్ సేనదే అంటున్నారు. దీనికి బలమైన కారణం కూడా చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


అసలైనోడే దూరం!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. పర్సనల్ రీజన్స్‌తో అతడు ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ సిరీస్ జరిగే టైమ్‌కు కమిన్స్ భార్య డెలివరీ ఉండటంతో అతడు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. అయితే కమిన్స్ లంకకు వెళ్లకపోవడానికి మెయిన్ రీజన్ అది కాదు. చీలమండ గాయం తగ్గకపోవడంతోనే అతడు ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలియజేశాడు. కమిన్స్ గాయం తీవ్రత ఎంతో తెలుసుకునేందుకు త్వరలో స్కానింగ్ చేస్తారని వ్యాఖ్యానించాడు. దీంతో కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండటం కష్టంగా కనిపిస్తోంది.


కప్పు మనదే!

గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ పూర్తిగా దూరమయ్యే ఛాన్స్ ఉందని ఇంగ్లీష్ మీడియాలో వినిపిస్తోంది. ఇది తెలిసిన భారత అభిమానులు ఈసారి చాంపియన్స్ ట్రోఫీ మనదేనని బల్లగుద్ది చెబుతున్నారు. వైట్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ సేన చాలా బాగా ఆడుతోందని అంటున్నారు. వన్డే ప్రపంచ కప్-2023 ట్రోఫీ కొంచెంలో మిస్ అయిందని.. రన్నరప్‌గా నిలిచామని, కానీ పొట్టి వరల్డ్ కప్-2024ను భారతే సొంతం చేసుకుందని గుర్తుచేస్తున్నారు. వన్డేల్లో మన టీమ్ బలంగా ఉందని.. మిగతా జట్ల కంటే ఆసీస్‌తోనే మనకు పోటీ అని, అలాంటి టీమ్ కెప్టెన్ కమిన్స్ లేకపోతే ఇంక భారత్‌కు ఎదురులేదని కామెంట్స్ చేస్తున్నారు. భారత్ ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ చేరడం ఖాయం.. రాసిపెట్టుకోండి అంటున్నారు.


ఇవీ చదవండి:

ఒకే ఓవర్‌లో 7 బౌండరీలు.. బాదుడుకు కేరాఫ్ అడ్రస్

బుమ్రా ఇంజ్యురీపై అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా..

నాకు అక్కర్లేదు.. డివోర్స్ రూమర్స్‌పై ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్

ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2025 | 04:40 PM