Share News

Australia: ముగ్గురు స్టార్లు ఔట్.. చాంపియన్స్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు

ABN , Publish Date - Feb 05 , 2025 | 01:44 PM

Pat Cummins: చాంపియన్స్ ట్రోఫీని మరోమారు సొంతం చేసుకోవాలని చూస్తున్న డేంజరస్ టీమ్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. మెగా టోర్నీకి ముందు ఆ జట్టులోని ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు.

Australia: ముగ్గురు స్టార్లు ఔట్.. చాంపియన్స్ ట్రోఫీపై ఆస్ట్రేలియా  ఆశలు గల్లంతు
Australia Team

టీ20 వరల్డ్ కప్‌-2024 ట్రోఫీ మిసైన బాధలో ఉన్న ఆస్ట్రేలియా.. ఎలాగైనా చాంపియన్స్ ట్రోఫీ కప్పును చేజిక్కించుకోవాలని చూస్తోంది. భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి బడా జట్ల నుంచి పోటీ ఉన్నా ట్రోఫీని పట్టేయాలని పట్టుదలతో ఉంది. అయితే మెగా టోర్నీకి ముందు ఆ టీమ్‌కు ఏదీ కలసి రావడం లేదు. కప్పు సంగతి దేవుడెరుగు.. కనీసం పోటీలో ఉండటం కూడా కష్టంగానే కనిపిస్తోంది. దీనికి కారణం ప్రధాన ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాల బారిన పడటమే. కంగారూ సేనలోని ముగ్గురు రాక్షసులు గాయాల కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు తెలుస్తోంది. వాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


కోచ్ ఏమన్నారంటే..

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు సారథి ప్యాట్ కమిన్స్ మెగా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం ఖాయంగా మారింది. చీలమండ గాయంతో బాధపడుతున్న కమిన్స్.. ఈ ఇంజ్యురీ వల్ల ప్రస్తుత శ్రీలంక సిరీస్‌లో ఆడలేదు. గాయం నుంచి కోలుకోకపోయినా అతడ్ని చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి సెలెక్ట్ చేశారు. టోర్నీకి ఇంకా నెలన్నర సమయం ఉండటంతో అప్పటికల్లా రికవర్ అవుతాడని అందరూ భావించారు. కానీ గాయం మానలేదని.. చాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడటం అనుమానమేనని స్వయంగా ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ చెప్పాడు.


ఆశలు గల్లంతు!

కమిన్స్ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు కాబట్టి మెగా టోర్నీలో అతడు ఆడటం కష్టమేనని కోచ్ మెక్‌డొనాల్డ్ చెప్పాడు. తమ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఉందన్నాడు. సీనియర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లో ఒకరు సారథిగా టీమ్‌ను ముందుండి నడిపించడం ఖాయమన్నాడు. గాయాలతో బాధపడుతున్న హేజల్‌వుడ్, మిచెల్ మార్ష్ కూడా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కష్టమేనని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కమిన్స్, హేజల్‌వుడ్, మార్ష్ దూరమైతే ఇంక ఆసీస్‌కు కప్పు కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు. ట్రోఫీ మీద ఆశలు వదులుకోండి అంటూ కంగారూ ఫ్యాన్స్‌ను టీజ్ చేస్తున్నారు.


ఇదీ చదవండి:

అభిషేక్‌తో నాకు పోలికేంటి.. శుబ్‌మన్ గిల్ సీరియస్

బుమ్రా ప్లేస్‌లో టీమ్‌లోకి స్పిన్ మాంత్రికుడు.. గట్టి ప్లానే

ఒక్క సిరీస్‌తో తక్కువ చేస్తే ఎలా?

మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 01:52 PM