Share News

PBKS vs GT Shreyas Iyer: కావాలనే సెంచరీ మిస్.. కెప్టెన్ అంటే అయ్యర్‌లా ఉండాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 09:51 AM

Shashank Singh: కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఫస్ట్ మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్‌ బోణీ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్. అయితే తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. దీనిపై విధ్వంసక బ్యాటర్ శశాంక్ సింగ్ స్పందించాడు.

PBKS vs GT Shreyas Iyer: కావాలనే సెంచరీ మిస్.. కెప్టెన్ అంటే అయ్యర్‌లా ఉండాలి
Shreyas Iyer

ఫస్ట్ ట్రోఫీ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న పంజాబ్ కింగ్స్.. ఈ ఐపీఎల్ సీజన్‌ను పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి పోరులో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది అయ్యర్ సేన. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన గుజరాత్.. 20 ఓవర్లలో 232 పరుగులు చేయగలిగింది. 42 బంతుల్లో 97 పరుగులతో పీబీకేఎస్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే అతడు సెంచరీకి అడుగు దూరంలో ఆగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


అందుకే బ్యాక్ స్టెప్

మూడంకెల మార్క్‌ను అందుకునే అవకాశం ఉన్నా శ్రేయస్ వద్దనుకున్నాడు. దీనికి కారణం ఏంటనేది పించ్ హిట్టర్ శశాంక్ సింగ్ బయటపెట్టాడు. జీటీతో మ్యాచ్‌లో ఆఖర్లో ఓ ఎండ్‌లో అయ్యర్, మరో ఎండ్‌లో శశాంక్ (16 బంతుల్లో 44 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. అయ్యర్ సెంచరీకి చేరువలో ఉండటంతో అతడు ఆ మార్క్‌ను అందుకుంటాడా.. లేదా.. అనేది ఆసక్తిని రేకెత్తించింది. కానీ శశాంక్‌కు ఎక్కువ స్ట్రైక్ ఇచ్చి సెంచరీ మిస్ అయ్యాడు అయ్యర్. ఈ విషయంపై శశాంక్ క్లారిటీ ఇచ్చాడు. అతడు కావాలనే సెంచరీ మిస్ అయ్యాడని స్పష్టం చేశాడు. తాను మంచి ఊపు మీద ఉండటం, టీమ్‌ బిగ్ స్కోరుకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో అయ్యర్ బ్యాక్ స్టెప్ వేశాడని.. తనకు ఎక్కువ స్ట్రైకింగ్ ఇచ్చాడని రివీల్ చేశాడు.


ప్రతి బాల్‌ బాదేయ్..

స్ట్రైక్ కావాలా అని అయ్యర్‌ను అడుగుదామని వెళ్లానని.. కానీ అతడే దగ్గరకు వచ్చి తన సెంచరీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నాడని శశాంక్ తెలిపాడు. ప్రతి బాల్‌ను బాదమని సూచించాడని పేర్కొన్నాడు. ఇది టీమ్ గేమ్ అని చెప్పిన శశాంక్.. కొన్ని సమయాల్లో మన గురించి మనం ఆలోచించకుండా ఉండలేమన్నాడు. వ్యక్తిగత రికార్డులు, మైల్‌స్టోన్స్ అనేవి మైండ్‌లో నడుస్తుంటాయని.. కానీ అయ్యర్ అవేవీ కాదని, టీమ్ బాగు కోసం ఆలోచించడం సూపర్బ్ అంటూ మెచ్చుకున్నాడు శశాంక్. ఐపీఎల్‌లో 100 మార్క్‌ను చేరుకోవడం బ్యాటర్లకు అంత ఈజీ కాదని.. కానీ చాన్స్ ఉన్నా అయ్యర్ దాన్ని వద్దనుకున్నాడని వ్యాఖ్యానించాడు. ఇది విన్న నెటిజన్స్.. కెప్టెన్ అంటే అయ్యర్‌లా ఉండాలి.. జట్టు గురించి ఆలోచించి మైల్‌స్టోన్స్‌ను వద్దనుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసిస్తున్నారు.


ఇవీ చదవండి:

క్రేజీ స్టేడియం కూల్చివేత

ఒక్క గోల్‌ కూడా లేకుండానే..

‘ఇంపాక్ట్‌’ మంచిదే !

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2025 | 10:00 AM