Rahul Dravid: నడవలేని స్థితిలో ద్రవిడ్.. అసలు మాజీ కోచ్‌కు ఏమైంది..
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:12 AM
IPL 2025: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నడవలేని స్థితిలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడూ ఫుల్ ఫిట్‌గా ఉండే ది వాల్.. హఠాత్తుగా చేతి కర్రల సాయంతో నడవడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది.

ఐపీఎల్‌లో పాపులర్ టీమ్స్‌లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ ఫుల్ ప్రిపరేషన్ మోడ్‌లో ఉంది. ఈసారి కప్పు కొట్టాల్సిందేననే పంతం ఆ టీమ్ ప్లేయర్లలో కనిపిస్తోంది. కొత్త సీజన్‌కు ముందు జైపూర్‌లో ఏర్పాటు చేసిన ట్రెయినింగ్ క్యాంప్‌లో ఆ జట్టు ఆటగాళ్లు చెమటలు కక్కుతున్నారు. గంటల కొద్దీ శ్రమిస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వ్యూహ రచన.. ఇలా అన్నింటా మెరుగవడంపై ఫోకస్ చేస్తున్నారు. అయితే క్యాంప్ స్టార్ట్ అయి చాన్నాళ్లు కావొస్తున్నా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం జాయిన్ అవకపోవడంతో ఆయనకు ఏమైంది.. ఎందుకు రాలేదనే అనుమానాలు మొదలయ్యాయి.
రీజన్ ఏంటి..
నిన్న మొన్నటి వరకు రాజస్థాన్ ప్రాక్టీస్ సెషన్స్‌లో కనిపించని ద్రవిడ్.. హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అయితే చేతి కర్రల సాయంతో నడవడం, కాలికి బ్యాాండేజ్ లాంటి భారీ పట్టీ ఉండటం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. అసలు ఆయనకు ఏమైంది.. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే రాహుల్ ద్రవిడ్.. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉండటం, ఇతరుల సాయంతో అడుగులు వేయడానికి గల కారణం ఏంటని అంతా చర్చిస్తున్నారు. ద్రవిడ్ నడవలేని స్థితిలో ఉండటానికి గాయమే కారణమని తెలుస్తోంది. స్వస్థలం బెంగళూరులో క్రికెట్ ఆడుతూ ద్రవిడ్ గాయం బారిన పడ్డారని సమాచారం.
కొడుకుతో కలసి ఆడితే..
ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఆ తర్వాత కోచ్‌గా కొత్త కెరీర్‌ను స్టార్ట్ చేశాడు ద్రవిడ్. అయితే ఇటీవల మళ్లీ బ్యాట్ పట్టి బరిలోకి దిగాడు. విజయ క్రికెట్ క్లబ్ తరఫున మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రూప్ 3 సెమీఫైనల్ మ్యాచ్‌లో తనయుడు అన్వయ్‌తో కలసి ఆడాడు ద్రవిడ్. అయితే 28 బంతుల్లో 29 పరుగులు చేసిన ది వాల్.. పరుగులు తీసే క్రమంలో ఇబ్బంది పడ్డాడు. అయినా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి నొప్పి తీవ్రత పెరగడంతో టీమ్‌మేట్స్ సాయంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ట్రీట్‌మెంట్ తర్వాత తాజాగా రాజస్థాన్ క్యాంప్‌కు హాజరయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి:
క్రికెట్‌కు బంగ్లా స్టార్ గుడ్‌బై
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి