Share News

IPL 2025: రబాడపై పగబట్టిన బీసీసీఐ.. ఏం పాపం చేశాడని ఈ శిక్ష..

ABN , Publish Date - Apr 03 , 2025 | 10:21 AM

Indian Premier League: బీసీసీఐని ప్రశ్నించినందుకు చిక్కుల్లో పడ్డాడు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ. అతడితో జీటీ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

IPL 2025: రబాడపై పగబట్టిన బీసీసీఐ.. ఏం పాపం చేశాడని ఈ శిక్ష..
Kagiso Rabada

ఐపీఎల్ లేటెస్ట్ ఎడిషన్‌లో వరుసగా రెండో విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్. నిన్న ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది గిల్ సేన. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానానికి ఎగబాకింది జీటీ. ఇదే జోరులో మరిన్ని మ్యాచుల్లో నెగ్గి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాలని చూస్తోంది. అయితే అంతా బాగానే ఉన్నా స్టార్ పేసర్ కగిసో రబాడతో గుజరాత్ టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. భారత క్రికెట్ బోర్డు ఆదేశాలతో రబాడతో జీటీ ఆడుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


కావాలనే తప్పించారా..

ఆర్సీబీతో మ్యాచ్‌లో రబాడను టీమ్‌లోకి తీసుకోలేదు జీటీ. దీనికి ఆ జట్టు సారథి శుబ్‌మన్ గిల్ చెప్పిన కారణం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల రబాడను ఆడించడం లేదని అన్నాడు. దీంతో లేనిపోని సందేహాలు తలెత్తుతున్నాయి. టోర్నీలో ఆడదామని వచ్చిన ప్లేయర్‌ బరిలోకి దిగకపోవడానికి పర్సనల్ రీజన్స్ ఏం ఉంటాయా.. అని అంతా ఆలోచనల్లో పడ్డారు. గుజరాత్-ముంబై మధ్య జరిగిన గత మ్యాచ్‌లో రబాడ ఆడాడు. అతడు ఫుల్ ఫిట్‌గా కనిపించాడు. గాయాలేమీ లేవు, పర్సనల్ రీజన్స్ వల్లే ఆడట్లేదని గిల్ అన్నాడు. దీంతో అతడ్ని కావాలనే తప్పించారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.


బీసీసీఐ ఆదేశాలతోనే..

ఈ ఐపీఎల్ ఆరంభంలో దాదాపుగా ఆరేడు మ్యాచుల్లో అన్ని జట్లు 200 ప్లస్ స్కోర్లను బాదాయి. దీంతో రబాడ మాట్లాడుతూ.. పిచ్‌లు మరీ ఫ్లాట్‌గా ఉన్నాయని.. ఇది క్రికెట్ కాదు, బ్యాటర్ల గేమ్‌గా అనిపిస్తోందన్నాడు. బ్యాట్-బాల్‌కు మధ్య బ్యాలెన్స్ లేనప్పుడు గేమ్ ఇలాగే ఉంటుందని, ఇలాగేనా మ్యాచులు నిర్వహించేది అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఐపీఎల్ నిర్వాహకులు, బీసీసీఐపై సీరియస్ అయ్యాడు రబాడ. దీంతో ఆ తర్వాత నుంచి పిచ్‌లు మారడం, 200 లోపే స్కోర్లు నమోదవడాన్ని గమనించొచ్చు. ఈ క్రమంలోనే తమపై సీరియస్ అయిన రబాడను టీమ్‌లోకి తీసుకోవద్దని జీటీ మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. అందుకే నిన్న ఆర్సీబీతో పోరులో అతడ్ని ఆడించలేదని టాక్. ఇది తెలిసిన నెటిజన్స్.. ప్రశ్నించడం కూడా పాపమేనా.. ఏం తప్పు చేశాడని రబాడను వేధిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.


ఇవీ చదవండి:

ముంబైకి బై.. గోవాకి జై!

సంజూకి లైన్‌ క్లియర్‌

ధీరజ్‌కు శాప్‌ చైర్మన్‌ హామీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2025 | 10:25 AM