Share News

Virat Kohli-Arshad Warsi: కోహ్లీ ఔట్.. స్టార్ యాక్టర్‌పై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:14 AM

RCB vs GT: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులు ఓ ప్రముఖ నటుడిపై సీరియస్ అవుతున్నారు. విరాట్‌ను ఎందుకు ఔట్ చేశావంటూ అతడిపై గరంగరం అవుతున్నారు.

 Virat Kohli-Arshad Warsi: కోహ్లీ ఔట్.. స్టార్ యాక్టర్‌పై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్
Virat Kohli

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్‌పై గరంగరం అవుతున్నారు. కింగ్‌ను ఎందుకు ఔట్ చేశావంటూ అతడి మీద సీరియస్ అవుతున్నారు. నిన్ను వదిలేదే లేదు.. చూస్కుందాం అంటూ అతడికి వార్నింగ్ ఇస్తున్నారు. కోహ్లీ అభిమానులు బెదిరిస్తోంది మరెవర్నో కాదు.. ప్రముఖ హిందీ నటుడు అర్షద్ వార్సీ. మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాతో పాపులర్ అయిన ఈ నటుడికి కింగ్ ఫ్యాన్స్ ధమ్కీ ఇస్తున్నారు. మరి.. అర్షద్ వార్సీ కోహ్లీని ఔట్ చేయడం ఏంటి.. అతడిపై అభిమానులు కారాలు మిరియాలు నూరాల్సిన అవసరం ఏం వచ్చింది.. అనేది ఇప్పుడు చూద్దాం..


ఇద్దరూ ఒకటేనా..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో గురువారం మ్యాచ్ జరిగింది. ఇందులో జీటీ 8 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ (7)ను గుజరాత్ పేసర్ అర్షద్ ఖాన్ ఔట్ చేశాడు. పుల్ షాట్ ఆడబోయిన విరాట్.. బాల్ ఊహించినంత వేగంగా రాకపోవడం, షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బౌలర్ అర్షద్‌ను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్.. యాక్టర్ అర్షద్ వార్సీకి మెసేజ్‌లు పంపించారు. అతడి పోస్ట్‌ల కింద కోహ్లీని ఎందుకు ఔశావని ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. ఆ అర్షద్, ఈ అర్షద్ ఒక్కరే అనుకొని.. బాలీవుడ్ యాక్టర్‌కు ధమ్కీ ఇచ్చారు. ఈ ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


ఇవీ చదవండి:

రబాడపై పగబట్టిన బీసీసీఐ

ముంబైకి బై.. గోవాకి జై!

సంజూకి లైన్‌ క్లియర్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2025 | 11:14 AM