Rinku Singh: వివాహ బంధంలోకి రింకూ సింగ్.. ఎంపీతో ఎంగేజ్‌మెంట్
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:58 PM
Rinku Singh: టీమిండియాలో ఉన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో పించ్ హిట్టర్ రింకూ సింగ్ ఒకడు. అతడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అలాంటి రింకూ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది.

టీమిండియా పించ్ హిట్టర్ రింకూ సింగ్ వివాహం బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఓ ఎంపీతో అతడి నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు సరోజ్‌తో రింకూ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని సమాచారం. అయితే నిశ్చితార్థ వార్తలపై అటు రింకూ నుంచి గానీ ఇటు సరోజ్ నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాలేదు. అలాగని ఈ న్యూస్‌ను వాళ్లిద్దరూ ఖండించనూ లేదు. అయితే అధికారికంగా ప్రకటించే వరకు ఏదీ చెప్పలేం.
చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా?
రింకూ కెరీర్ విషయానికొస్తే.. అతడు ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఆ టీమ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు లెఫ్టాండ్ బ్యాటర్ ఎంపికయ్యాడు. ఆ సిరీస్‌లో అదరగొట్టాలని అతడు భావిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఇంకా స్క్వాడ్‌ను ప్రకటించలేదు బీసీసీఐ. ఒకవేళ ఆ టీమ్‌లో గనుక రింకూ ఉంటే చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లోనూ ఉంటాడు. ఎందుకంటే మెగా టోర్నీకి ఇంకా ఎక్కువ టైమ్ లేనందున అక్కడ ఆడే ఆటగాళ్లను ఇంగ్లీష్ టీమ్‌తో సిరీస్‌లో రిపీట్ చేసే చాన్సులు ఉన్నాయి. ఆ టీమ్‌లో రింకూ ఉంటాడా? లేదా? అని అనుకుంటున్న వేళ సడన్‌గా అతడి నిశ్చితార్త వార్త వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
సర్ఫరాజ్ తప్పు చేశాడా.. డ్రెస్సింగ్ రూమ్ దొంగ ఎవరు..
కోహ్లీ వాచ్ కలెక్షన్ చూస్తే షాక్.. ఓ వాచ్ ధరతో ఇల్లు కొనేయొచ్చు
ఐపీఎల్‌కు రోహిత్-కోహ్లీ దూరం.. స్టార్లపై బీసీసీఐ ఉక్కుపాదం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి