Share News

Riyan Parag: 64 బంతుల్లో 144 నాటౌట్.. ఐపీఎల్‌కు ముందే హిట్టింగ్ షురూ

ABN , Publish Date - Mar 20 , 2025 | 09:42 AM

Rajasthan Royals: ఓ బ్యాటింగ్ పిచ్చోడు ఐపీఎల్-2025 ఆరంభానికి ముందే ఊచకోత మొదలెట్టేశాడు. బౌలర్ల బెండు తీస్తూ భారీ షాట్లతో స్టన్నింగ్ సెంచరీ బాదేశాడు. అతడు కొట్టిన షాట్లలో బౌండరీలతో పోటీ పడ్డాయి సిక్సులు. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ లెవల్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Riyan Parag: 64 బంతుల్లో 144 నాటౌట్.. ఐపీఎల్‌కు ముందే హిట్టింగ్ షురూ
Rajasthan Royals

ఐపీఎల్-2025 ఆరంభానికి ముందే బౌండరీలు, సిక్సుల వర్షం కురుస్తోంది. క్యాష్ రిచ్ లీగ్‌ స్టార్ట్ అవడానికి మరో రెండ్రోజుల సమయమే మిగిలి ఉండటంతో అన్ని జట్లు భీకరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి సాధన కొనసాగిస్తున్నారు. ఇంట్రా స్క్వాడ్‌లుగా విడిపోయి మ్యాచులు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఓ మ్యాచ్‌లో ఒక రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ భారీ సెంచరీతో చెలరేగిపోయాడు. 64 బంతుల్లోనే ఏకంగా 144 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


సిక్సుల వర్షం

రాజస్థాన్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో 64 బంతుల్లోనే 144 పరుగులు బాదేశాడు. అతడి బ్యాట్ నుంచి 16 ఫోర్లతో పాటు ఏకంగా 10 సిక్సులు ఉండటం విశేషం. బౌండరీలు, సిక్సుల ద్వారానే 124 పరుగులు పిండుకున్నాడు రియాన్. అతడితో పాటు ఈ మ్యాచ్‌లో ఇతర స్టార్లు కూడా రాణించారు. దేవ్‌దత్ పడిక్కల్ 44 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులతో తాను రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నానని ప్రూవ్ చేశాడు. వీళ్ల బ్యాటింగ్ చూసిన నెటిజన్స్.. ఇతర జట్లకు రాజస్థాన్‌తో డేంజర్ తప్పదని హెచ్చరిస్తున్నారు. జైస్వాల్, పరాగ్, సంజూ శాంసన్ తమ సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే రాజస్థాన్‌కు తిరుగుండదని చెబుతున్నారు. అయితే నిలకడగా పరుగులు చేయడం, బాధ్యతాయుతంగా ఆడటం కీలకమని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

పాండ్యాకు మెంటల్ టార్చర్

హెచ్‌సీఏలో రూ.90 లక్షల అవినీతి

క్రీడలకు రూ.465 కోట్ల భారీ బడ్జెట్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2025 | 09:59 AM