Share News

Chahal-RJ Mahvash: చాహల్ గర్ల్‌ఫ్రెండ్ సంచలన పోస్ట్.. టార్గెట్ చేసి మరీ..

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:32 PM

Dhanashree Verma: చాహల్-ధనశ్రీ డివోర్స్ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇందులో రోజుకో ట్విస్ట్ వస్తోంది. ఇప్పుడు ఆర్జే మహ్వాష్ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

Chahal-RJ Mahvash: చాహల్ గర్ల్‌ఫ్రెండ్ సంచలన పోస్ట్.. టార్గెట్ చేసి మరీ..
Yuzvendra Chahal

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య ఆట కంటే పర్సనల్ లైఫ్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ధనశ్రీ వర్మకు అతడు విడాకులు ఇస్తున్నట్లు జోరుగా వినిపిస్తోంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల మీద తీర్పు వెలువడనుందని తెలుస్తోంది. ఈ తరుణంలో చాహల్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌గా చెబుతున్న ఆర్జే మహ్వాష్ సంచలన పోస్ట్‌ పెట్టింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏం ఉందంటే..


లైక్ కొట్టిన చాహల్

చాహల్ విడాకుల వార్తల వేళ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది మహ్వాష్. అబద్ధాలు, దురాశ, మోసాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. వీటికి దూరంగా ఉంటూ కూడా ఈ స్థాయిలో జీవితంలో ధైర్యంగా నిలబడటం గొప్ప విషయమని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్.. ధనశ్రీ వర్మకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలా పోస్ట్ పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌కు చాహల్ లైక్ కొట్టడం ఆ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తోంది.


సాలిడ్ కౌంటర్

విడాకుల నేపథ్యంలో భరణం కింద ధనశ్రీకి రూ.4.75 కోట్లు చెల్లించేందుకు చాహల్ రెడీ అవుతున్నాడని క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహ్వాష్ చేసిన పోస్ట్.. ధనశ్రీకి సాలిడ్ కౌంటర్ అని తెలుస్తోంది. కాగా, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో చాహల్‌‌తో కలసి కనిపించింది మహ్వాష్. ఇద్దరూ సన్నిహితంగా కనిపించడంతో డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత వీటిని మహ్వాష్ కొట్టిపారేసింది. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని తెలిపింది. అయితే చాహల్ మాత్రం సైలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు. అటు ధనశ్రీతో విడాకుల గురించి కానీ.. ఇటు మహ్వాష్‌తో రిలేషన్ గురించి గానీ ఓపెన్ అవ్వడం లేదు. ఐపీఎల్-2025 నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ శిబిరంలో జోరుగా సాధన చేస్తున్నాడు చాహల్.


ఇవీ చదవండి:

ప్రధాని గల్లీ క్రికెట్.. లెజెండ్‌తో కలసి..

64 బంతుల్లో 144 నాటౌట్

పాండ్యాకు మెంటల్ టార్చర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2025 | 12:39 PM

News Hub