Rohit Sharma: అప్పటివరకు నేనే కెప్టెన్.. కుండబద్దలు కొట్టిన రోహిత్
ABN , Publish Date - Jan 12 , 2025 | 02:55 PM
టీమిండియా కెప్టెన్సీ గురించి గత కొన్నాళ్లుగా జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. వన్డే, టెస్ట్ ఫార్మాట్‌కు కొత్త సారథి రాక ఖాయమని వినిపించింది. రోహిత్ జమానా అయిపోయిందని.. ఇక నయా తరం చేతుల్లోకి భారత జట్టు వెళ్లడం పక్కా అని పుకార్లు వచ్చాయి.
టీమిండియా కెప్టెన్సీ గురించి గత కొన్నాళ్లుగా జోరుగా ఊహాగానాలు వస్తు్నాయి. వన్డే, టెస్ట్ ఫార్మాట్‌కు కొత్త సారథి రాక ఖాయమని వినిపించింది. రోహిత్ జమానా అయిపోయిందని.. ఇక నయా తరం చేతుల్లోకి భారత జట్టు వెళ్తుందని పుకార్లు వచ్చాయి. హిట్‌మ్యాన్ అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా ఫ్లాప్ అవడంతో అతడు సైడ్ అయిపోవడం పక్కా అని.. బీసీసీఐ కొత్త కెప్టెన్‌పై త్వరలో ప్రకటన చేస్తుందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై రోహిత్ కుండబద్దలు కొట్టేశాడని సమాచారం. నేనే కెప్టెన్ అంటూ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
సేమ్ డైలాగ్ రిపీట్!
ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించింది బీసీసీఐ. బోర్డు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సభ్యులు, కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో భవిష్యత్తు టెస్టు, వన్డే సారథ్యం మీద చర్చ జరిగిందట. బీజీటీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటాడని వినిపించినా.. అలాంటిదేమీ లేదని సిడ్నీ టెస్ట్ టైమ్‌లో అతడు స్పష్టం చేశాడు. అదే మాటను నిన్న బోర్డు మీటింగ్‌లోనూ నొక్కి చెప్పాడట. మరికొన్ని నెలలు తానే కెప్టెన్‌గా కంటిన్యూ అవుతానని హిట్‌మ్యాన్ చెప్పాడని కథనాలు వస్తున్నాయి.
ఢోకా లేదు!
టెస్ట్, వన్డే టీమ్‌కు కొత్త కెప్టెన్ ఖరారయ్యే వరకు తానే సారథిగా కొనసాగుతానని బోర్డు సమావేశంలో రోహిత్ చెప్పాడట. కాగా, హిట్‌మ్యాన్‌కు బదులు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్ చేయాలనే డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతడి గాయం, ఫిట్‌నెస్ మీద బీసీసీఐ ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. గాయాలతో సావాసం చేసే బుమ్రాకు సారథ్య పగ్గాలు అప్పగించే విషయంలో బోర్డు పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లుంది. బుమ్రా ఫుల్ ఫిట్‌నెస్ సాధించే వరకు హిట్‌మ్యాన్‌నే సారథిగా కంటిన్యూ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ కెప్టెన్సీ పోస్ట్‌కు ఢోకా లేనట్లు కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
రోహిత్ యూ టర్న్.. కన్‌ఫ్యూజన్‌లో గంభీర్.. ఇదేం ట్విస్ట్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. ఇక కప్పు కష్టమే..
హార్దిక్‌ను కాదని అక్షర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ తిక్కకు ఓ లెక్కుంది
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి