Rohit Sharma: గ్రౌండ్‌లో బూతులు.. కావాలనే తిడతాడా.. క్లారిటీ ఇచ్చిన రోహిత్
ABN , Publish Date - Mar 15 , 2025 | 11:47 AM
Mumbai Indians: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఫీల్డ్‌లో తాను చూపించే అగ్రెషన్ వెనుక అసలు కారణాన్ని రివీల్ చేశాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ ఏమన్నాడంటే..

క్రికెట్‌లో ఒక్కో కెప్టెన్‌ది ఒక్కో శైలి. కొందరు కూల్‌గా అన్ని వ్యవహారాలు చక్కబెడితే.. మరికొందరు అగ్రెషన్ చూపిస్తారు. మహేంద్ర సింగ్ ధోని లాంటి అరుదైన సారథులు ఎంత ప్రెజర్ ఉన్నా తాము కూల్‌గా ఉంటూ, ఇతర ఆటగాళ్లనూ అలాగే ఉంచుతారు. విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్స్ దూకుడు కనబరుస్తూ, సహచరులనూ అదే తోవలో నడిపించి కావాల్సిన రిజల్ట్ రాబడతారు. ఈ రెండింటినీ కలిపితే అది రోహిత్ శర్మ స్టైల్ ఆఫ్ కెప్టెన్సీ అనొచ్చు. టీమ్‌ను కూల్‌గా నడిపిస్తూనే అవసరమైన సమయంలో అగ్రెషన్ డోస్‌నూ పెంచుతుంటాడు. ఈ క్రమంలో పలుమార్లు బూతులు, తిట్ల దండకం అందుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీనిపై తాజాగా రియాక్ట్ అయ్యాడు హిట్‌మ్యాన్.
మేమంతా ఫ్యామిలీ
గ్రౌండ్‌లో కొన్నిసార్లు ఎమోషనల్ అవుతుంటానని రోహిత్ చెప్పాడు. మ్యాచ్ కండీషన్స్‌ను బట్టి భావోద్వేగానికి గురవుతుంటానని తెలిపాడు. ఇలా ఎమోషనల్ అయిన సందర్భాల్లో కొన్నిసార్లు పరుష పదాలు వాడాల్సి వస్తుందన్నాడు హిట్‌మ్యాన్. అయితే అభ్యంతకర పదాలు వాడినంత మాత్రాన తప్పుగా అనుకోవాల్సిన పని లేదన్నాడు. తామంతా ఒక టీమ్ అని.. దేశం కోసం కలసి ఆడుతున్నామనే భావన లోలోపల ఉంటుందన్నాడు రోహిత్. తాము ఒక జట్టు మాత్రమే కాదు.. ఫ్యామిలీ కూడా అని స్పష్టం చేశాడు. ఎవరి మీదైనా తాను సీరియస్ అయినా, ఏమైనా అనేసినా అది తీవ్రంగా భావించొద్దన్నాడు. తామంతా సోదరులమని, ఒక కుటుంబంలో ఉండే ఎమోషన్స్, బాండింగ్, రెస్పెక్ట్ తమ మధ్య ఉందన్నాడు రోహిత్. కాగా, ఐపీఎల్-2025 కోసం సన్నద్ధమవుతున్నాడు హిట్‌మ్యాన్. నయా సీజన్‌లో రెచ్చిపోయి ఆడాలని అనుకుంటున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫామ్‌నే అక్కడా కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.
ఇవీ చదవండి:
వరుణ్‌కు చంపేస్తామని బెదిరింపులు
ముంబై తొలిపోరుకు హార్దిక్ దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి