Share News

Sachin Tendulkar: సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:48 PM

BCCI: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ అందుకున్నప్పటికీ ఇది మాత్రం మాస్టర్ బ్లాస్టర్ కెరీర్‌లో చాలా స్పెషల్‌గా గుర్తుండిపోనుంది. మరి.. ఆ పురస్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Sachin Tendulkar: సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
Sachin Tendulkar

టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో అందుకోని అవార్డు, రివార్డు లేదు. ఏకంగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా అతడ్ని వరించింది. ఐసీసీ నుంచి బీసీసీఐ వరకు క్రికెట్ బోర్డులు అందించే అత్యున్నత అవార్డులు అతడ్ని వెతుక్కుంటూ వచ్చాయి. అలాంటి సచిన్‌ మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇప్పటివరకు అందుకున్న అవార్డులతో పోలిస్తే ఇది చాలా స్పెషల్ అనే చెప్పాలి. భారత క్రికెట్ బోర్డు అతడికి ఈ పురస్కారం అందించనుంది. మరి.. క్రికెట్ గాడ్‌ను వరించిన ఆ అవార్డు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


అవార్డు ఏంటంటే?

సచిన్ టెండూల్కర్‌ను ఘనంగా సత్కరించనుంది బీసీసీఐ. శనివారం జరగబోయే వార్షికోత్సవంలో నమన్ అవార్డులను అందజేయనుంది బోర్డు. ఈ సందర్భంగానే సచిన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం అందజేయనుందని తెలుస్తోంది. 2024 ఏడాదికి గానూ మాస్టర్ బ్లాస్టర్‌కు ఈ అవార్డును ఇవ్వనున్నట్లు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ బీసీసీఐ వర్గాలు నేషనల్ మీడియాకు ఈ సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో సీకే నాయుడు పురస్కారం స్వీకరించబోయే 30వ భారత క్రికెటర్‌గా సచిన్ అరుదైన ఘనత అందుకోవడం ఖాయం. ఈ విషయం తెలిసిన అభిమానులు క్రికెట్ గాడ్‌కు విషెస్ చెబుతున్నారు. ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నారు. సచిన్‌కు తిరుగులేదని.. ఆయన రేంజ్ ఏంటో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన క్రికెట్‌కు మరిన్ని సేవలు అందించాలని అంటున్నారు.


ఇవీ చదవండి:

ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం

కోహ్లీని ఔట్ చేసిన టికెట్ కలెక్టర్.. ఎవరీ హిమాన్షు సాంగ్వాన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 04:53 PM