LSG vs PBKS: పంత్‌కు లక్నో ఓనర్ వార్నింగ్.. అందరూ చూస్తుండగానే..
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:08 AM
Indian Premier League: ఐపీఎల్ కొత్త ఎడిషన్‌లో దూసుకెళ్తోంది పంజాబ్ కింగ్స్. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈసారి లక్నో సూపర్ జియాంట్స్‌ను చిత్తు చేసింది అయ్యర్ సేన.

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్‌లో సంజీవ్ గోయెంకా బాగా ఫేమస్. తన జట్టు ఓటమిని ఆయన తట్టుకోలేడు. అందుకే పరాజయం పలకరిస్తే చాలు.. టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు సారథి మీద సీరియస్ అవుతాడు. అందరూ చూస్తుండగానే కెప్టెన్స్‌ను తిట్టడం లాంటివి చేస్తుంటాడు. ఓటములకు తట్టుకోలేక సారథులను మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా లక్నో సూపర్ జియాంట్స్ కొత్త కెప్టెన్ రిషబ్ పంత్‌తోనూ అదే రకంగా వ్యవహరించి వార్తల్లో నిలిచాడు. ఆడియెన్స్ ముందే పంత్‌కు ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
జహీర్ ఖాన్ ముందే..
ఐపీఎల్ నయా సీజన్‌లో లక్నో ఆడిన 3 మ్యాచుల్లో రెండింట పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఫుల్ డిజప్పాయింట్ అయ్యాడు. కోట్లు పోసి తెచ్చుకున్న పంత్ నిన్న కూడా ఫెయిల్ అయ్యాడు. 2 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఆయన ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువైంది. అంతే మ్యాచ్ అవ్వగానే పంత్ దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ సీరియస్‌గా ఏదో అంటూ కనిపించాడు గోయెంకా. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మెంటార్ జహీర్ ఖాన్ ముందే పంత్‌కు చేతిని చూపిస్తూ ఇంకేదో అంటూ కనిపించాడు. ఆ టైమ్‌లో పంత్ ఏం చెప్పాలో తెలియక.. సైలెంట్‌గా ఉండటం, తల కింద వేసుకొని నిలబడిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్.. గోయెంకా మొదలెట్టేశాడని, ఇక ఓటములు వస్తున్న కొద్దీ పంత్‌ను ఇలాగే ఏదో ఒకటి అంటూ ఉంటాడని, తిట్లు-కోపాలు కామన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
అయ్యర్‌కు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి