Sarfaraz Khan: సర్ఫరాజ్ తప్పు చేశాడా.. డ్రెస్సింగ్ రూమ్ దొంగ ఎవరు..
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:12 PM
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ దొంగ ఉన్నాడని.. అతడే భారత జట్టు అంతర్గత అంశాలు బయటపెడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసినప్పటి నుంచి టీమిండియాకు సంబంధించి అనేక వివాదాలు మొదలయ్యాయి. కెప్టెన్సీ మార్పు దగ్గర నుంచి అనేక అంశాలపై చర్చ జరుగుతోంది. ఆ సిరీస్ ఆఖరి టెస్ట్‌లో రిషబ్ పంత్‌తో పాటు పలువురు సీనియర్ల మీద హెడ్ కోచ్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడని.. టీమ్‌లో నుంచి బయటకు వెళ్లిపొమ్మంటూ వార్నింగ్ ఇచ్చాడంటూ కథనాలు వచ్చాయి. ఈ లీక్స్ ఇచ్చిందెవరనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటపెట్టింది మరెవరో కాదు.. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అని వినిపిస్తోంది.
అతడి వల్లే లీకులు!
వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో భారత్ దారుణంగా ఓడిపోయింది. దీంతో జనవరి 11న టీమిండియా పెర్ఫార్మెన్స్‌పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు బీసీసీఐ పెద్దలు. ఇందులో జట్టులో తీసుకురావాల్సిన మార్పులతో పాటు టీమ్ చుట్టూ అల్లుకున్న పలు కాంట్రవర్సీల మీదా చర్చించారట. ఇదే సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వివాదం పైనా డిస్కస్ చేశారట. ఈ లీకులపై గంభీర్ మాట్లాడుతూ.. సర్ఫరాజ్ వల్లే డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు పొక్కాయని అన్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అతడిపై గౌతీ సీరియస్ అయ్యాడట. తాజాగా ఈ వివాదంపై టర్బనేటర్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు.
గంభీర్ మాట్లాడాలి!
‘గత కొన్నాళ్లుగా భారత జట్టు వరుస పరాభవాలను చూస్తోంది. ఇలాంటి తరుణంలో డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రావడం కరెక్ట్ కాదు. ఆసీస్ టూర్‌లో డ్రెస్సింగ్ రూమ్ విషయాలు సర్ఫరాజ్ లీక్ చేశాడని గంభీర్ చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. హెడ్ కోచ్ చెప్పాడంటే అతడు అలా చేసి ఉండాల్సింది కాదు. సర్ఫరాజ్ గనుక తప్పు చేసి ఉంటే అతడితో గంభీర్ మాట్లాడాలి. కూర్చొని మాట్లాడితే ఇలాంటి సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి. ఆటగాళ్లకు, కోచ్‌కు మధ్య మంచి రిలేషన్ ఉండాలి. బీసీసీఐ రివ్యూ మీటింగ్‌లోని అంశాలు కూడా బయటకు లీక్ అవుతున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇది సరికాదు’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
ఐపీఎల్‌కు రోహిత్-కోహ్లీ దూరం.. స్టార్లపై బీసీసీఐ ఉక్కుపాదం
ఖేల్‌రత్న అందుకున్న మను, గుకేశ్
10 పాయింట్లతో బీసీసీఐ ప్రక్షాళన షురూ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి