Shreyas Iyer: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అయ్యర్.. వాళ్లే టార్గెట్‌గా..
ABN , Publish Date - Mar 15 , 2025 | 03:48 PM
Team India: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. వాళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు ముందుకెళ్తున్నాడు. మరి.. అయ్యర్ నయా బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్లకు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంది. ఇది వాళ్లు ధరించే బట్టలు, వాచ్‌లు, క్యాప్స్ లాంటి వాటిని చూసి చెప్పొచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లు ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటారు. డిఫరెంట్ క్లోత్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇక్కడితో వాళ్లు ఆగిపోలేదు.. దీన్నే బిజినెస్ ఐడియాగానూ మార్చుకున్నారు. ఇప్పటికే కోహ్లీ క్లోత్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. తాజాగా అయ్యర్ కూడా కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. అతడు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
అదే లక్ష్యంగా..
క్లోతింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అయ్యర్. హ్యూమన్ అనే కంపెనీతో కొలాబొరేట్ అయ్యాడీ స్టార్ బ్యాటర్. కొత్త ఫ్యాషన్ కలెక్షన్‌ను యూత్‌కు పరిచయం చేయడమే టార్గెట్‌గా తాము ఒక్కటయ్యామని హ్యూమన్-అయ్యర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్యాషన్, పర్సనల్ ఎక్స్‌ప్రెషన్ ఉట్టిపడేలా తమ ఉత్పత్తులు ఉంటాయని హ్యూమన్ సంస్థకు చెందిన ప్రణవ్ మిశ్రా తెలిపారు.
ఎంతో ఇష్టం
హ్యూమన్-అయ్యర్ భాగస్వామ్యంలో రూపొందుతున్న దుస్తుల్లో టీషర్ట్స్‌తో పాటు షర్ట్స్, బాటమ్స్ ఉంటాయని ప్రణవ్ పేర్కొన్నారు. యూత్‌కు నచ్చేలా స్ట్రీట్ ఫ్యాషన్ ఉట్టిపడేలా వీటిని డిజైన్ చేశామన్నారు. ‘ఇదో అద్భుతమైన అనుభవం. ఫ్యాషన్ అంటే ముందు నుంచి నాకు ఇష్టం. హ్యూమన్ టీమ్‌తో కలసి పని చేయడం వల్ల ఫ్యాషన్‌ను మరింతగా అర్థం చేసుకున్నా. ప్రతి చిన్న విషయాన్ని వాళ్లు లోతుగా అధ్యయనం చేస్తారు. కళను ఫ్యాషన్‌తో వాళ్లు జోడించిన తీరు చాలా ప్రత్యేకంగా అనిపించింది’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడిన శ్రేయస్.. ఈసారి పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్ మార్చి 20న మొదలుకానుంది. కానీ అయ్యర్ టీమ్ మాత్రం 25వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని షురూ చేయనుంది.
ఇవీ చదవండి:
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్
బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్
కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్న రాహుల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి