Share News

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. హార్దిక్‌ ప్లేస్‌లో..

ABN , Publish Date - Mar 19 , 2025 | 03:08 PM

IPL 2025: ముంబై ఇండియన్స్ జట్టు తమ నూతన సారథిని ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో అతడే తమ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది. మాజీ సారథి రోహిత్ శర్మను కాదని అతడికి కెప్టెన్సీ చార్జ్ ఇచ్చింది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. హార్దిక్‌ ప్లేస్‌లో..
Mumbai Indians

ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. తాజాగా ఈ విషయంపై ఎంఐ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను సారథిగా నియమిస్తున్నట్లు వెల్లడించింది. అదేంటి.. హార్దిక్ పాండ్యా రూపంలో సాలిడ్ కెప్టెన్‌ ఉండగా.. సూర్యకు పగ్గాలు ఇవ్వడం ఏంటని షాక్ అవుతున్నారా.. అయితే దీని వెనుక ఓ బలమైన రీజన్ ఉంది. ఏంటా రీజన్.. సడన్‌గా సూర్యకు సారథ్యాన్ని అప్పగించడానికి గల కారణం ఏంటి.. ముంబై యాజమాన్యం ఇలా ఎందుకు చేసింది.. అనేది ఇప్పుడు చూద్దాం..


అప్పుడు చేసిన తప్పునకు..

ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2025 ఫస్ట్ మ్యాచ్‌లో ఆడటం లేదు. గతేడాది ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు హార్దిక్. ఈ కారణంగానే మార్చి 23వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడటం లేదు. దీంతో అతడి స్థానంలో తొలి మ్యాచ్‌లో కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను నియమించింది ఎంఐ మేనేజ్‌మెంట్. ఈ ఒక్క మ్యాచ్‌కే మిస్టర్ 360 సారథిగా వ్యవహరిస్తాడు. మిగతా మ్యాచుల్లో పాండ్యా కెప్టెన్‌గా కొనసాగుతాడు. కాగా, చెపాక్ వేదికగా చెన్నైతో జరిగే మ్యాచ్‌లో హార్దిక్‌తో పాటు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఆడటం లేదు. వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న స్టార్ పేసర్.. ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తాడో ఇంకా క్లారిటీ లేదు. వీళ్లిద్దరూ లేనందున సూర్యతో పాటు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరింత బాధ్యతతో ఆడాల్సి ఉంటుంది.


ఇవీ చదవండి:

పాక్ ప్లేయర్ పిల్ల చేష్టలు

అంపైర్‌గా వరల్డ్ కప్ హీరో

ఐపీఎల్ కోసం రాహుల్ త్యాగం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2025 | 03:13 PM