Virat Kohli: లగ్జరీ బంగ్లా కొన్న కోహ్లీ-అనుష్క.. కొత్త ఇంటికి అన్ని కోట్లా..
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:22 AM
Virat Kohli Aliabaug House: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు కొన్నాడు. ఆ బంగ్లా ఖరీదు ఎంతో తెలిస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే. మరి.. కింగ్ కొత్తింటి సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదన ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు టీమిండియాకు, ఇటు ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ బాగానే వెనకేసుకున్నాడు కోహ్లీ. అడ్వర్టయిజ్‌మెంట్స్‌లో నటిస్తూ కోట్లు గడిస్తున్నాడు. అదే సమయంలో రెస్టారెంట్స్, క్లోత్ బిజినెస్ ద్వారా తన సంపాదనను మరింత పెంచుకుంటున్నాడు. అలాంటి విరాట్ కొత్తగా మరో ఇల్లును కొన్నాడు. దాని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. కొత్తింటి కోసం కింగ్ ఎంత ఖర్చు చేశాడు? అది ఎక్కడ ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం..
అంత ఖర్చా?
మహారాష్ట్రలోని అలీబాగ్‌లో లగ్జరీ బంగ్లాను కొన్నారు కోహ్లీ-అనుష్క దంపతులు. 2 వేల స్క్వేర్ ఫీట్ విల్లాను 2023లోనే కొనుగోలు చేశారు విరుష్క. స్టాంప్ డ్యూటీతో కలిపి ఈ ఇంటి కోసం రూ.6 కోట్ల 36 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఆ బంగ్లాను తమ టేస్ట్‌కు తగ్గట్లు రెనోవేట్ చేయించారట. ఇంటీరియర్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటివి తమ అభిరుచికి తగ్గట్లు ఉండేలా చూసుకున్నారట. అందుకోసం కోట్లలో ఖర్చు పెట్టారట. గృహ ప్రవేశం కోసం సిద్ధమవుతున్న ఈ బంగ్లా ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 6 కోట్లతో కొన్నప్పటికీ నిర్మాణం పూర్తైన తర్వాత దీని విలువ రూ.32 కోట్లకు చేరిందని తెలుస్తోంది.
షిఫ్ట్ అవుతాడా?
కొత్తింట్లో కోహ్లీ తిరుగాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్లానింగ్ దశ నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇంటి విశేషాలను అతడు అందులో అభిమానులతో షేర్ చేసుకుంటూ కనిపించాడు. ఇది తన డ్రీమ్ హోమ్ అని.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని అందులో చెప్పుకొచ్చాడు కోహ్లీ. ఫ్యామిలీతో కలసి అక్కడ గడపబోయే అపురూపమైన క్షణాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు విరాట్. కాగా, ఈ మధ్య సతీమణి అనుష్క, పిల్లలతో కలసి లండన్‌లో ఎక్కువగా ఉంటున్నాడు కింగ్. మరి.. అలీబాగ్‌లోని ఇంటి గృహ ప్రవేశం తర్వాత పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అవుతాడేమో చూడాలి.
ఇవీ చదవండి:
టీమిండియాకు కొత్త కోచ్.. గంభీర్‌కు గట్టి షాక్
ఆ మాటలు నమ్మొద్దు.. ఫ్యాన్స్‌కు బుమ్రా రిక్వెస్ట్
పారిస్ పతకాల నాణ్యతపై విమర్శలు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి